Begin typing your search above and press return to search.

21 అడుగుల ముద్దుగుమ్మ కాంస్య విగ్రహం

భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ షకీరా

By:  Tupaki Desk   |   28 Dec 2023 1:30 PM GMT
21 అడుగుల ముద్దుగుమ్మ కాంస్య విగ్రహం
X

భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ షకీరా. ఆమె తన బెల్లీ డాన్స్ మరియు గాత్రం తో ప్రపంచ సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన విషయం తెల్సిందే. గ్రామీ అవార్డు గ్రహీత అయిన షకీరా యొక్క అద్భుతమైన కాంస్య విగ్రహం ను ఆవిష్కరించారు.

21 అడుగుల షకీరా కాంస్య విగ్రహం ను ఆమె సొంత పట్టణం అయిన బారన్క్విల్లా లో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక మేయర్ జైమ్‌ పుమరెజో ఈ విగ్రహంను ఆమె తల్లిదండ్రుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. విగ్రహ ఆవిష్కరణ కు పెద్ద ఎత్తున షకీరా ఫ్యాన్స్ హాజరు అయ్యారు.

మాగ్డలీనా నది తీరంలో ఈ విగ్రహం ను ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విగ్రహం మరియు విగ్రహంకు సంబంధించిన విషయాలు చర్చించుకుంటూ ఉన్నారు. షకీరా కు అరుదైన గౌరవం దక్కడం తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

విగ్రహంలో షకీరా మోడ్రన్ డ్రెస్ ను ధరించి, బెల్లీ డాన్స్ స్టెప్‌ వేస్తున్నట్లుగా ఉంది. అంతే కాకుండా పొడవాటి రింగుల జుట్టు ను కలిగి ఉన్నట్లు కూడా ఈ అతిపెద్ద విగ్రహం లో షకీరా ను చూపించారు. 2023 ఏడాదికి గాను గ్రామీ అవార్డు ను దక్కించుకున్న నేపథ్యంలో ఈ అతి పెద్ద కాంస్య విగ్రహం ను నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలుస్తోంది.