Begin typing your search above and press return to search.

ఘాటైన లుక్కులో షాలిని పాండే.. మైండ్ బ్లాక్!

శాలిని పాండే.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే చిత్రం అర్జున్ రెడ్డి.

By:  Tupaki Desk   |   24 Sep 2024 1:02 PM GMT
ఘాటైన లుక్కులో షాలిని పాండే.. మైండ్ బ్లాక్!
X

శాలిని పాండే.. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు వచ్చే చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తోనే కాకుండా తన గ్లామర్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించుకున్న ఈ క్యూట్ హీరోయిన్, అప్పటి నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అర్జున్ రెడ్డి తర్వాత అదే స్థాయిలో సక్సెస్ పొందలేకపోయింది.

ఇప్పటివరకు పదిహేనుకు పైగా సినిమాలు చేసినప్పటికీ, శాలిని పాండేకు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరే అవకాశాలు మాత్రం ఇంకా రావడం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో నిత్యం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెరుగుతున్న ఫాలోవర్స్ తో పాటు, తన గ్లామర్ డోస్ ని కూడా పెంచుకుంటూ, ఫ్యాన్స్ లో మరింత క్రేజ్ పొందుతోంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఫోటోలో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టైల్ గా ఉన్నప్పటికీ, ఆమె గ్లామర్ మాత్రం మరింతగా హైలైట్ అయ్యింది. తలవంచి అలా ఇచ్చిన ఈ స్టిల్ అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఫోటోలో ఆమె ముఖం మీద హ్యాపీ ఎక్స్‌ప్రెషన్ కనిపించడం, మెడ దగ్గర అందాలు ఘాటుగా ప్రెజెంట్ కావడం మరింతగా ఆకర్షణగా నిలిచాయి.

ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటోపై పాజిటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. "షాలిని మరోసారి తన గ్లామర్ తో స్టన్ అయ్యేలా చేసింది" అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా శాలిని పాండే ఈ తరహాలో బోల్డ్ ఫోటోలు షేర్ చేసినప్పటికీ, తాజా ఫోటో మాత్రం అభిమానులను కొత్తగా అనిపించింది. ఇక ప్రస్తుతం అమ్మడు తమిళంలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చిన్న చిన్న సినిమాలతో బిజీగా కనిపిస్తోంది.