అలాంటి పాత్ర ఇప్పుడొస్తే ఇంకా బాగా చేస్తా!
తాజాగా షాలినీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
By: Tupaki Desk | 18 March 2025 8:00 PM ISTఅర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది షాలినీ పాండే. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్న షాలినీ, ఆ తర్వాత పలు అవకాశాలను అందుకుని తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తాజాగా షాలినీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి పాత్ర తో ప్రతీ ఒక్కరినీ మెప్పించింది షాలినీ. అయితే అర్జున్ రెడ్డి రిలీజ్ టైమ్ లో ఆ సినిమాలోని హీరో హీరోయిన్ల పాత్రలను కొందరు కామెంట్ చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా వీక్ గా ఉందని అన్నారు. తాజాగా షాలినీకి ఈ విషయమై ఓ ప్రశ్న ఎదురైంది. ప్రీతి తరహా పాత్ర ఇప్పుడొస్తే యాక్సెప్ట్ చేస్తారా అని అడిగారు.
ఆ ప్రశ్నకు షాలినీ ఆసక్తికర సమాధానమిచ్చింది. ప్రీతి పాత్రను తను కెరీర్ స్టార్టింగ్ లో చేశానని, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఎంతో ఇన్నోసెంట్ గా అనిపిస్తుందని, సినిమాలో తన క్యారెక్టర్ ను మరింత బలంగా చేయొచ్చమో అనిపిస్తుందని ఇప్పుడు అలాంటి పాత్ర వస్తే నో చెప్పను కానీ ఆ పాత్రపై మరింత అవగాహన పెంచుకుని నటిస్తానంటోంది షాలినీ.
అప్పుడు యాక్టింగ్ కొత్త కాబట్టి ప్రీతి పాత్రను గొప్పగా చేయలేకపోయానని, ప్రస్తుతం నటనలో పరిణీతి చెందాను కాబట్టి ఆ పాత్రను మరింత మెచ్యూర్డ్ గా చేయగలనని చెప్తోన్న షాలినీ, ఇప్పుడలాంటి క్యారెక్టర్ వస్తే డైరెక్టర్ తో మాట్లాడి కొన్ని మార్పులు చేయించుకుని ఆ పాత్రలో నటిస్తానంటోంది. డబ్బా కార్టెల్ సిరీస్‌లో ఎంతో బలమైన మహిళ పాత్రలో కనిపించిన షాలినీ అందులో రాజీ అనే పాత్రలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సిరీస్ లో జ్యోతిక, షబానా అజ్మీ కీలక పాత్రల్లో నటించగా, ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.