Begin typing your search above and press return to search.

షాలిని పాండే పూల్ సైడ్ ట్రీట్

షాలిని తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. పూల్ సైడ్ షాలిని ట్రీట్ కి యూత్ ఫిదా అయిపోతోంది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 4:13 AM GMT
షాలిని పాండే పూల్ సైడ్ ట్రీట్
X

'అర్జున్ రెడ్డి' భామ షాలినీ పాండే హిందీ అరంగేట్ర చిత్రం 'జయేష్‌భాయ్ జోర్దార్' (2022) బాక్సాఫీస్ వ‌ద్ద‌ స‌క్సెస్ అయ్యి ఉండ‌క‌పోవ‌చ్చు..కానీ న‌టిగా షాలిని ఫెయిల్ కాలేద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆ త‌ర్వాత కూడా త‌న‌ను అవ‌కాశాలు వ‌రించాయి. తదుప‌రి మహారాజ్ చిత్రంతో అరంగేట్రం చేయనున్న అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ సరసన పాండే కనిపించింది. ఇటీవ‌లే మ‌హారాజ్ థియేట‌ర్ల‌లో విడుద‌లై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. ముఖ్యంగా షాలినికి మ‌రోసారి మంచి ప్ర‌తిభ ఉన్న‌ న‌టి అన్న గుర్తింపు ద‌క్కింది.

ఆస‌క్తిక‌రంగా షాలిని సోష‌ల్ మీడియాల్లో త‌న స‌హ‌న‌టీమ‌ణుల‌కు తీవ్ర‌మైన పోటీనిస్తోంది. అదే క్ర‌మంలో వ‌రుస‌గా బికినీలు, స్విమ్ సూట్ల‌తో చెల‌రేగిపోతోంది. నిజానికి షాలిని యావ‌రేజ్ బ్యూటీ. కానీ హ‌ద్దులు చెరిపేస్తూ అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. షాలిని తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. పూల్ సైడ్ షాలిని ట్రీట్ కి యూత్ ఫిదా అయిపోతోంది.

మ‌రోవైపు షాలిని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. ఇటీవ‌లి ఓ ఇంట‌ర్వ్యూలో షాలిని త‌న ఒంట‌రి ప్ర‌యాణం గురించి ఓపెనైంది. పరిశ్రమలో తనకు గాడ్‌ఫాదర్ లేడని పాండే పేర్కొంది. నేను ఏ సినిమా చేయాలి.. ఏది వ‌ద్దు.. సినిమా చేయాలా వద్దా అనేది నాకు ఎవరూ చెప్పడం లేద‌ని అంది. ఆడిష‌న్స్ ద్వారా మాత్ర‌మే తాను 'మ‌హారాజా' చిత్రానికి ఎంపిక‌య్యాన‌ని షాలిని వెల్ల‌డించింది.

తాను మనీష్ శర్మను కలిసే వరకు ఆడిషన్ చేస్తున్నానని నాకు తెలియదు. అప్పుడే రణ్‌వీర్‌ సింగ్‌ సరసన సినిమా అని తెలిసింది. మీకు రణవీర్ సరసన సినిమా ఆఫర్ వ‌స్తే...అని అడిగారు. గర్భవతిగా న‌టించాల‌ని శర్మ తనతో చెప్పినట్లు షాలిని గుర్తుచేసుకుంది. గట్ ఫీలింగ్ తో ముందుకు వెళ్లినా కానీ నా నిర్ణ‌యం త‌ప్పు అని అంది. కానీ నా దగ్గర ఉన్నది ఒక్కటే అవ‌కాశం. నేను జయేష్‌భాయ్‌ని ప్రేమిస్తున్నాను .. ఎందుకు కాదు అని వారికి చెప్పాను. నేను ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఫలితాన్ని నియంత్రించలేను.. కానీ నేను కనీసం నేర్చుకోగలను. నాకు జయేష్‌భాయ్ చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న‌ప్పుడే మహారాజ్ అవ‌కాశం వ‌చ్చింది అని తెలిపింది.