దెయ్యం పట్టినదానిలా మారా...సూసైడ్ అటెంప్ట్ చేసా!
బాలీవుడ్ నటి షామా సికిందర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు నెట్టింట హాట్ ఫోటోలతో సంచలనం రేపడం అమ్మడి ప్రత్యేకత.
By: Tupaki Desk | 21 Sep 2024 5:13 AM GMTబాలీవుడ్ నటి షామా సికిందర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు నెట్టింట హాట్ ఫోటోలతో సంచలనం రేపడం అమ్మడి ప్రత్యేకత. సినిమాలతో సంబంధం లేకుండా పాపులర్ అయిందంటే? తనలో ఆ క్వాలిటీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాటిని చూసి అభిమానులు అంతే ఆస్వాదిస్తుంటారు. షామా బ్యూటీ గురించి నిత్యం నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది.
ఇదంతా రోజు ఉండే డిస్కషనే. కానీ షామా వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆమె ఎంతగా మానసిక క్షోభ అనుభవి స్తుందన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. షామా సికిందర్ ఓ జన్యుపరమైన జబ్బుతో 15 ఏళ్ల క్రితం బాధ పడినట్లు తెలిపింది. బైపోలార్ డిజార్డ్ ఉందిట. ఇది వాళ్ల నాయనమ్మ నుంచి వచ్చిన జబ్బుగా తెలిపింది. వింతగా ప్రవర్తించేదట. ఒక్కోసారి చేష్టలు చూసి దెయ్యం పట్టిన దానిలో ప్రవర్తించేదాన్ని అని తెలిపింది.
కానీ ఈ జనరేషన్ లో పుట్టినది కావడంతో కొన్ని రకాల విమర్శల నుంచి తప్పించుకోగలిగానంది. అయితే ఒకానొక దశలో తీవ్ర మానసిక ఒత్తిడితో సూసైడ్ చేసుకోవాలనుకుందిట. నిద్ర మాత్రలు మిగిందిట. అనం తరం తన బ్యాక్ వివరాలు సోదరుడికి పంపడంతో అతడు భయపడి అదే ఇంట్లో ఉన్న అమ్మకు కబురు పంపడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.
వెంటనే తన తల్లి గదిలోకి వచ్చి నిద్రలేపే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లడం...సకాలంలో వైద్యం అందడంతో బ్రతికి బట్ట కట్టినట్లు తెలిపింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు ఇంటికే పరిమితం అయిందట. అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుని ఏడవడం.. మానసక కృంగుబాటుకు గురవ్వడంతో అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడంతో తేరుకున్నట్లు తెలిపింది.