Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : పింక్‌ బికినీలో అందాల సికిందర్‌

మూడు మిలియన్‌లకు పైగా ఫాలోవర్స్‌ కలిగి ఉన్న ఈమె లేటు వయసులో అందాల ఆరబోత చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 Dec 2024 3:15 AM GMT
పిక్‌టాక్‌ : పింక్‌ బికినీలో అందాల సికిందర్‌
X

హిందీ టీవీ సీరియల్స్‌తో నార్త్‌ ఇండియాలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ షామా సికిందర్‌. ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా అదే అందంతో నెటిజన్స్‌ను కవ్విస్తూనే ఉంది. బాబోయ్‌ ఇంత అందం ఎలా సాధ్యం అన్నట్లు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేసే ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి. మూడు మిలియన్‌లకు పైగా ఫాలోవర్స్‌ కలిగి ఉన్న ఈమె లేటు వయసులో అందాల ఆరబోత చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.


యే మేరి లైఫ్‌ హై టీవీ సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకోవడం ద్వారా హిందీ ప్రేక్షకులకు చేరువ అయ్యింది. సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అందుకే ఈమె సీరియల్స్‌కి ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది. బుల్లి తెరపై ఈమెకి మంచి డిమాండ్‌ క్రియేట్‌ అయ్యింది. బుల్లితెరపై ఈమెను చూసి అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈమె షేర్‌ చేస్తున్న ఫోటోలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేయడం స్టార్ హీరోయిన్స్‌ కి సాధ్యమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌కి పోటీ అన్నట్లుగా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తున్న షామా సికిందర్‌ మరోసారి పింక్‌ బికినీ ఫోటోలను షేర్‌ చేసి కుర్రకారు గుండెల్లో గుబులు మొదలు పెట్టింది. ఇంత అందంగా ఉన్నా ఎందుకు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా వరుస ఆఫర్లు రాలేదు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ హీరోయిన్‌ల రేంజ్‌లో అందాలను చూపిస్తున్న షామా సికిందర్‌కి సీనియర్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు అయినా వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

1998లోనే ఫిరోజ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ప్రేమ్‌ ఆగ్గన్‌ తో సినిమా ఇండస్ట్రీలో షామా సికిందర్‌ ఎంట్రీ ఇచ్చింది. 16 ఏళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు. అందుకే సినిమా ఇండస్ట్రీలో కాకుండా బుల్లి తెరపై ఈమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ లక్‌ కలిసి రావడంతో ఇన్నాళ్లు ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సెకండ్‌ ఇన్నింగ్స్ తో అయినా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చాలా మందికి ఆలస్యంగా అవకాశాలు వస్తాయి.. కనుక షామా సికిందర్‌కీ ఇకపై హీరోయిన్‌ ఆఫర్లు రావాలని ఈ ఫోటోలను చూస్తూ ఉంటే అనిపిస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.