Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: స‌లీం కోసం అనార్ వెయిటింగ్

తాజాగా షామా షేర్ చేసిన ట్రెడిష‌న‌ల్ శారీ లుక్ ఇంట‌ర్నెట్ ని మ‌రిగిస్తోంది.

By:  Tupaki Desk   |   9 Feb 2025 2:30 AM GMT
ఫోటో స్టోరి: స‌లీం కోసం అనార్ వెయిటింగ్
X

షామా శికంద‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. వ‌ర‌స‌ ఫోటోషూట్‌ల‌తో అగ్గి రాజేస్తున్న ఈ బ్యూటీ బోల్డ్ & డ‌స్కీ లుక్స్ తో హృద‌యాల్ని ట‌చ్ చేస్తుంది. తాజాగా షామా షేర్ చేసిన ట్రెడిష‌న‌ల్ శారీ లుక్ ఇంట‌ర్నెట్ ని మ‌రిగిస్తోంది. చీర‌లో షామా ముగ్ధ మ‌నోహ‌ర రూపానికి యూత్ ఫిదా అయిపోతోంది.


షామా ఈ కొత్త లుక్ లో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. దేవ‌దాస్ కోసం ఎదురు చూస్తున్న పార్వ‌తిలా.. స‌లీం కోసం వెయిటింగ్ లో ఉన్న అనార్ లాగా క‌నిపిస్తోందంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సింపుల్ శారీకి డిజైన‌ర్ బ్లౌజ్ కాంబినేష‌న్ ప‌ర్పెక్ట్ ఫిట్ గా క‌నిపిస్తోంది. చేతిలో క‌లువ రేకు బూరె బుగ్గ‌ను తాకుతుంటే య‌థాలాపంగా ఏదో ఆలోచిస్తూ క‌నిపించింది. షామా ట్రెడిష‌న‌ల్ లుక్ కి బంగారు వ‌ర్ణం డిజైన‌ర్ ప‌రికిణీ, చెవుల‌కు ఆ పొడవాటి జూకా అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఈ లుక్ చూడ‌గానే విర‌హంతో వీగిపోతున్న రాణిలా క‌నిపిస్తోందంటూ కొంద‌రు అభిమానులు పొగిడేస్తున్నారు.

`యే మేరీ లైఫ్ హై` ఫేమ్.. నటి షామా.. జేమ్స్ మిల్లిరోన్ తో రొమాంటిక్ డేట్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. డేటింగ్ వ్య‌వ‌హారం ఎలా ఉన్నా కానీ, షామా ఇప్ప‌టికీ బాలీవుడ్ లో అవ‌కాశాల కోసం వేటను ఆప‌లేదు. సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ల‌పైనా దృష్టి సారించిందని క‌థ‌నాలొచ్చాయి.