Begin typing your search above and press return to search.

వీడియో: ర‌క్షాబంధ‌న్ కానుక‌గా షామా అదిరిపోయే ట్రీట్

అంత‌కుమించి ప్ర‌పంచ యాత్ర‌ల‌ను ఇష్ట‌ప‌డే ఉల్లాస‌క‌ర‌మైన అమ్మాయిగా షామా ఎల్లప్పుడూ సోష‌ల్ మీడియాల్లో ట‌చ్ లోనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 3:59 PM GMT
వీడియో: ర‌క్షాబంధ‌న్ కానుక‌గా షామా అదిరిపోయే ట్రీట్
X

షామా సికందర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టీవీ మూవీ న‌టిగా టాప్ మోడ‌ల్ గా సుప‌రిచితం. అంత‌కుమించి ప్ర‌పంచ యాత్ర‌ల‌ను ఇష్ట‌ప‌డే ఉల్లాస‌క‌ర‌మైన అమ్మాయిగా షామా ఎల్లప్పుడూ సోష‌ల్ మీడియాల్లో ట‌చ్ లోనే ఉంటుంది. యువ‌త‌రాన్ని క‌ట్టి ప‌డేసే ఫోటోషూట్ల‌ను నిరంత‌రం షేర్ చేస్తుంటారు. సినిమాలు షోలు ఒక వైపు.. సోషల్ మీడియా షోలు మ‌రోవైపు.. అభిమానులను అలరిస్తూనే ఉన్నాయి. షామా విజయవంతమైన నటి, నిర్మాత.. మానసిక ఆరోగ్య న్యాయవాది .. మోడ‌ల్ కం న‌టిగా ఇప్ప‌టికే తాను అనుకున్న‌ది సాధించుకుంది.

షామా ప్రపంచవ్యాప్తంగా అరుదైన‌ ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడే నిరంత‌ర‌ సంచారి. మంచి హృదయం..గొప్ప విలువలతో కూడుకున్న‌ స్వచ్ఛమైన స్వ‌దేశీ అమ్మాయి కూడా. ఈ విష‌యాన్ని రక్షా బంధన్ 2023 సెల‌బ్రేష‌న్ రివీల్ చేస్తోంది. షామా ఈసారి త‌న కుటుంబంతో ప్ర‌తిదీ వైభ‌వంగా ప్లాన్ చేసింది. "గడిచిన‌ సంవత్సరంలాగే ఈ సంవత్సరం రక్షా బంధన్ ప్రత్యేకమైనది. ఎల్లప్పుడూ నా సోదరులంద‌రితో రాఖీ పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నాను. న‌న్ను అన్నివిధాలా ప్రోత్స‌హించే నా సోద‌రులందరితో చాలా ప్రత్యేకమైన బంధం నాది. నా సోదరులతో మాత్రమే కాకుండా నేను నా ఇత‌ర కుటుంబీకుల‌తో గ‌డిపాను. ఈ రోజు నేను నా సోద‌రులిద్దరికీ రాఖీ కట్టాను.. నాపై అంద‌రూ ప్రేమ‌ను కురిపించి మ‌ద్ధ‌తుగా నిలిచారు..." అని తెలిపింది షామా. నా అమ్మ‌మ్మ నాయ‌న‌మ్మ‌ల‌ గురించి నేను చాలా గర్వపడుతున్నాను. నా సోదరులు ఎల్లప్పుడూ నా కుటుంబంతో కలిసి ఉంచారు. అందుకే నాకు ఇది ప్రత్యేకమైన రోజు. ఈ రోజంతా నా సోదరులు అమ్మ‌మ్మ‌ల‌తో గడిపాను.. నా బాబీలు నా కోసం రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టారు.. అని కూడా మురిసిపోయింది.

నా అభిమానులు-ఆరాధకులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భాన్ని సీరియస్‌గా తీసుకున్నందుకు .. సామాజికంగా మాత్రమే కాకుండా గొప్ప‌ పవిత్రతను స్వచ్ఛతను సజీవంగా ఉంచినందుకు ఈ దేశంలోని తోబుట్టువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అని స‌న్నీ వ్యాఖ్యానించింది. ఆస‌క్తిక‌రంగా వైట్ టాప్ లో షామా సొగ‌సును ఆవిష్క‌రించే తాజా వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ సరికొత్త ఫోటోషూట్ లో ఎంతో స్ట‌న్నింగ్ గా క‌నిపిస్తోంది ఈ బ్యూటీ. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... షామా త్వరలో త‌న త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి వెల్ల‌డించ‌నుంది.