పైట పక్కకు జరిపి మరీ ఊరిస్తోన్న బ్యూటీ!
తాజాగా అమ్మడు సంప్రదాయ చీరందంలో తళుకులీనింది. ఎరుపు రంగు చీర పై మ్యాచింగ్ రవిక ధరించి వీపు అంతా కప్పేసింది.
By: Tupaki Desk | 14 Nov 2023 11:30 AM GMTబాలీవుడ్ సోయగం శామా సికిందర్ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఎలాంటి డిజైనర్స్ ధరించినా అందులో తనదైన మార్క్ తప్పనిసరి. యువతని హీటెక్కించే ఘాటు ఫోజులకు ఏమాత్రం కొదవుండదు. ఎప్పటికప్పుడు ఇన్ స్టా లో సెగలు పుట్టించాల్సిందే. గ్లామర్ ఎలివేషన్లో తనదైన మార్క్ తప్పనిసరంటూ చెలరేగుతుంది. డిజైనర్ దుస్తుల్లో షామా అందాలకి యవత ఫిదా అవ్వాల్సిందే.
తాజాగా అమ్మడు సంప్రదాయ చీరందంలో తళుకులీనింది. ఎరుపు రంగు చీర పై మ్యాచింగ్ రవిక ధరించి వీపు అంతా కప్పేసింది. కానీ ఎద అందాల్ని మాత్రం పక్కాగా ప్రొజెక్ట్ చేసింది. ఎర్ర పైట పక్కకు జరిపి మరీ క్యామ్ కి ఫోజులిచ్చింది. ఆ సంగతి మిరర్ లో చెక్ చేసుకుని మరీ పిక్స్ చేసింది. ఇక అమ్మడి అలంకరణ.. చెవులీలు మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. శామా అనుచరగణం కామెంట్లు అంతే ఆసక్తికరం.
ఇలా శామా ఇన్ స్టాలో ఎంత ఫేమస్ అయినా ఏం లాభం? కెరీర్ పరంగా ఎలాంటి ఎదుగుదల లేదు. వృత్తి పరంగా ఇంకా వెనుకబడే ఉంది. 'ప్రేమ్ అగాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అటుపై 'మన్' ..'ది డెడ్లీ పార్ట్'.. 'బస్తీ'..'దూమ్ ధడాకా'..'కాంట్రాక్ట్' ..'సెక్సాహోలిక్' లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' లో నటించింది.
ఆ సినిమా రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కొత్త అవకాశాలేవి అందుకోలేదు. మరి తాజా ప్రయత్నాలేవైనా ఛాన్సులు తెచ్చి పెడతాయా? అన్నది చూడాలి. సొగసరి ప్రయత్నంలో మాత్రం లోపం లేదు. శక్తి వంచన లేకుండా శ్రమిస్తుంది. కానీ వరాలు ఇంకా ఆ గాడ్ ఇవ్వలేదు.