Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : స్విమ్ సూట్‌ లో చూపు తిప్పనివ్వని అందం

యే మేరి లైఫ్ హై సీరియల్‌ తో ఉత్తరాదిన సంచలన తారగా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ షామా సికిందర్.

By:  Tupaki Desk   |   15 Jun 2024 11:45 AM GMT
పిక్ టాక్ : స్విమ్ సూట్‌ లో చూపు తిప్పనివ్వని అందం
X

యే మేరి లైఫ్ హై సీరియల్‌ తో ఉత్తరాదిన సంచలన తారగా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ అమ్మడు చాలా తక్కువ సమయంలో బుల్లి తెరపై స్టార్‌ గా నిలిచింది. సుదీర్ఘ కాలం పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేయడం లో కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు.


రెండు దశాబ్దాలు దాటినా కూడా ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఈ ఫోటోలు అదే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. స్విమ్‌ సూట్‌ లో అందాల ఆరబోత చేసిన ఈ అమ్మడికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

వయసు పెరిగా కొద్ది షామా సికిందర్ అందాలు పెరుగుతున్నాయంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత కేవలం ఈ అమ్మడికే సొంతం అన్నట్లుగా సోషల్‌ మీడియా లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు పదుల వయసులో కూడా ఈ స్థాయి అందం కేవలం షామా సికిందర్ కి మాత్రమే సాధ్యం అయ్యింది. ముందు ముందు కూడా యంగ్‌ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చే విధంగా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ఖాయం.

ఇంతటి అందంగా ఉన్నా కూడా ఎందుకు ఈమెకు సినిమాల్లో ఎక్కువ ఆఫర్లు రాలేదు అంటూ ఇప్పుడు కొందరు చర్చ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ అమ్మడి సోషల్‌ మీడియా ఫోటోలు చూసి ఇండస్ట్రీ వర్గాల వారు సినిమాల్లో ఆఫర్లతో సంప్రదించడం ఖాయం.