Begin typing your search above and press return to search.

డెనిమ్ ప్లోర‌ల్ ఔట్ ఫిట్ లో హీటెక్కించిన శామా!

బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికింద‌ర్ ఇన్ న్ స్టా సెన్షేష‌న్ తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 6:39 AM GMT
డెనిమ్ ప్లోర‌ల్ ఔట్ ఫిట్ లో హీటెక్కించిన శామా!
X

బాలీవుడ్ హాట్ బ్యూటీ శామా సికింద‌ర్ ఇన్ న్ స్టా సెన్షేష‌న్ తెలిసిందే. ఎలాంటి డిజైన‌ర్ లో నైనా శామా సెగ‌లు పుట్టిం చాల్సిందే. ఎలివేష‌న్ లో త‌నదైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. హీటెక్కించే ఘాటు ఫోజుల్లో కిక్కు ఏమాత్రం త‌గ్గ‌దు. డిజైన‌ర్ దుస్తులేసినా..చీర క‌ట్టినా షామా బ్యూటీకి తిరుగుండ‌దు. ట్రెండ్ ని ఫాలో అవ్వ‌డం కాదు..ట్రెండ్ ని సెట్ చేసే టైపు. ఈ మ‌ధ్య కాలంలో శామా వేడి మ‌రింత రెట్టింపు చేసింది.


పోటీని త‌ట్టుకుని నిల‌వాలంటే? ఆ మాత్రం త‌ప్ప‌దంటూ కాంపిటీష‌న్ మార్కెట్ లో ముందుకు సాగిపో తుంది. సినిమా ఛాన్సులు త‌గ్గినా ఇంకా మీడియాలో ఫాంలో క‌నిపిస్తుందంటే? కార‌ణం ఈ ర‌క‌మైన ఎలివేష‌న్లు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అమ్మ‌డు డెనిమ్ బ్లూ జీన్స్ ఔట్ ఫిట్ లో అందాల‌తో దాడి చేసింది. అమ్మ‌డి స్కిన్ షో ఓ రేంజ్ లో హైలైట్ చేసింది.


పాల‌నురుగ‌ల శ‌రీర సౌంద‌ర్యంపై బ్లూ డెనిమ్ మ‌రింత షైనింగ్ అవుతుంది. అమ్మ‌డు క్యామ్ ని చూస్తూ ఎంపిక చేసుక‌న్న భంగిమ‌లు మ‌రింత హైలైట్. అమ్మ‌డి మ్యాక‌ప్..ఎంపిక చేసుకున్న యాక్స‌రసీస్ శామాని మ‌రింత అందంగా తీర్చిదిద్దాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. శామా బ్యూటీకి నెటి జ‌నులుంతా ఫిదా అవుతున్నారు. షామా అందాల్ని పొగిడేస్తూ అభిమానులంతా త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

ఇక షామా కెరీర్ సంగ‌తి చూస్తే `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.