Begin typing your search above and press return to search.

వీడియో: షామా సండే వైబ్స్

తాజాగా షామా శికంద‌ర్ త‌న ప‌ప్పీతో పాటు ఆరు బ‌య‌ట జాగింగ్ చేస్తున్న వీడియో అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. ఇందులో షామా చిట్టి పొట్టి నిక్క‌రులో క‌నిపించింది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 8:51 AM GMT
వీడియో: షామా సండే వైబ్స్
X

సోష‌ల్ మీడియా వినియోగ‌దారుల‌కు షామా శికంద‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నెట్టింట నిరంత‌రం ఏదో ఒక కొత్త ఫోటోషూట్ తో ఈ బ్యూటీ అగ్గి రాజేస్తుంటుంది. అలాంటి పోటోషూట్లు ఇటీవ‌ల తామ‌ర‌తంప‌ర‌గా చాలా విడుద‌ల‌య్యాయి. ఇవ‌న్నీ నెట్ లో వైర‌ల్ గా దూసుకెళ్లాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఓ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది డ‌స్కీ షామా.

తాజాగా షామా శికంద‌ర్ త‌న ప‌ప్పీతో పాటు ఆరు బ‌య‌ట జాగింగ్ చేస్తున్న వీడియో అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. ఇందులో షామా చిట్టి పొట్టి నిక్క‌రులో క‌నిపించింది. పావురాల గుట్ట‌లో ప‌ప్పీతో పాటు ప‌రుగులు పెడుతూ హాయిగా న‌వ్వేస్తోంది. అలా ప‌రిగెత్తుతున్న షామా కురులు గాల్లో ఎగురుతూ ఏదో తెలియ‌ని వైబ్ ని క్రియేట్ చేసాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

ఏం చేసినా కెరీర్ ఖాళీ:

ఈ వీడియోకి చాలా సింపుల్ క్యాప్ష‌న్ ఇచ్చింది. "ఆదివారం అడుగులు, ఛేజింగ్ వారాంతపు అనుభూతి!" అని వ్యాఖ్య‌ను జోడించింది. గాయ‌ని కం న‌టి షామా శికంద‌ర్ ఇంత‌కుముందు విదేశీ తో ప్రేమ‌లో ప‌డ్డాక నిరంత‌రం విహార‌యాత్ర‌ల్లో క‌నిపించింది. అత‌డితో స‌హ‌జీవ‌నం.. వరుస ఫోటోషూట్లు ఎప్ప‌టికప్పుడు హాట్ టాపిక్స్ గా మారాయి. షామా ఇటీవ‌లే అమెరికా విహారానికి కూడా వెళ్లింది. `యే మేరీ లైఫ్ హై` ఫేమ్.. టీవీ నటి షామా అమెరికా.. న్యూయార్క్.. ముంబై అంటూ అన్నిచోట్లా షికార్ల‌తో ట‌చ్ లోనే ఉంటోంది. కాబోయే భర్త జేమ్స్ మిల్లిరోన్ తో రొమాంటిక్ డేట్ లో ఉన్న ఈ బ్యూటీ వెండితెర ప్ర‌య‌త్నాల్ని మాత్రం విడిచిపెట్ట‌డం లేదు. షామా త‌దుప‌రి ఉత్త‌రాది టీవీ మూవీ రంగాల‌తో పాటు సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ల‌పైనా దృష్టి సారించింద‌ని తెలిసింది.