జాన్వీ- ఖుషి కాదు మరో కపూర్ గాళ్ దూసుకొస్తోంది
మరోవైపు సానయా కపూర్ ఈపాటికే డెబ్యూ నాయికగా పరిచయం కావాల్సి ఉన్నా మొదటి సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
By: Tupaki Desk | 21 Jan 2025 5:32 AM GMTఈ సంవత్సరం తెరపై కొత్త జంటల ట్రీట్ పుష్కలంగా ఆస్వాధించే వీలుంది. కొత్తతరం తారలు హిందీ చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. వీరిలో షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్.. సంజయ్ కపూర్ కుమార్తె సానయ కపూర్ ఉన్నారు.
సుహానా ఖాన్ తన తండ్రి షారూఖ్ తో కలిసి భారీ యాక్షన్ చిత్రం `కింగ్`లో నటిస్తోంది. మరోవైపు ఖుషి కపూర్ నటించిన `లవ్ యాపా` ఈ నెలలో విడుదలకు రానుంది. రొమాంటిక్ కామెడీలో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ సరసన ఖుషి నటించింది. మరోవైపు సానయా కపూర్ ఈపాటికే డెబ్యూ నాయికగా పరిచయం కావాల్సి ఉన్నా మొదటి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత విక్రాంత్ మాస్సే సరసన ఓ చిత్రానికి ఎంపికైంది. తాజా సమాచారం మేరకు తన రెండో సినిమా ఖరారు కానుంది. నవతరం కథానాయకుడు అభయ్ వర్మ సరసన షనాయ కపూర్ జంటగా నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఫిల్మ్‌ఫేర్ వివరాల ప్రకారం.. ఈ జంట కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అధికారికంగా సంతకం చేయకపోయినా త్వరలోనే చిత్రబృందం నుంచి ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సుజాత్ సౌదాగర్ దర్శకత్వం వహిస్తారు. యంగ్ హీరో అభయ్ వర్మ ఇటీవల `ముంజ్య`తో భారీ విజయం అందుకున్నారు. షనాయ కపూర్ రొమాంటిక్ డ్రామా `ఆంఖోన్ కి గుస్తాఖియాన్` ఇప్పటికే సెట్స్ పై ఉంది. ఇందులో విక్రాంత్ మాస్సే కథానాయకుడు. అభయ్ వర్మతో రెండో సినిమాలో షనాయ నటించే అకాశం అందుకుంది.
రాక్ ఆన్ 2 , బొంబై మేరీ జాన్ వంటి చిత్రాలకు పనిచేసిన సుజాత్ సౌదాగర్ ఈసారి కొత్త జంటతో ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు ఇప్పటికే నిరూపించారు. అందువల్ల తాజా ప్రాజెక్ట్ పై భారీ అంచనాలేర్పడ్డాయి.