Begin typing your search above and press return to search.

డైరెక్టర్ శంకర్ కి ఈడీ షాక్..!

2022 లో మనీలాండరింగ్ కేసులో భాగంగా డైరెక్టర్ శంకర్ కు నోటీసులు పంపించారు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 3:13 PM GMT
డైరెక్టర్ శంకర్ కి ఈడీ షాక్..!
X

స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో విచారణలో ఉండగా శంకర్ కి చెందిన 10.11 కోట్ల ఆస్తులు జప్తు చేసింది ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద డైరెక్టర్ శంకర్ ఆస్తులు ఈడీ జప్తు చేసినట్టు తెలుస్తుంది. 2022 లో మనీలాండరింగ్ కేసులో భాగంగా డైరెక్టర్ శంకర్ కు నోటీసులు పంపించారు. ఐతే ఇప్పటివరకు తన లాయర్ తో సంప్రదింపు చేయిస్తూ వచ్చారు.

ఇక తాజాగా ఈడీ అధికారులు మరోసారి ఈ కేసు విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఎంతిరన్ తెలుగులో రోబో సినిమాకు సంబందించిన కాపీ వివాదం మొదలైంది. కాపీ రైట్ ఇష్యూలో కూడా శంకర్ పేరు బలంగా వినిపించింది. శంకర్ రోబో సినిమా జిగుబాకి కాపీగా తెరకెక్కించారని తమిళనాడుకు చెందిన రచయిత ఆరూర్ తమిళనాదన్ 2011లో కోర్టులో కేసు వేశాడు.

ఐతే దీనికి సంబందించి 10 కోట్ల పైన ఆస్తులకు ఎలాంటి లెక్క పత్రాలు లేకపోవడం వల్ల ఈడీ శంకర్ కు సంబంధించిన ఆ ఆస్తులను జప్తు చేసింది. ఐతే స్టార్ డైరెక్టర్ శంకర్ ఆస్తులు ఈడీ జప్తు చేయడం గురించి తెలిసి తమిళ చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. బడా సినిమాల డైరెక్టర్ గా శంకర్ కి చాలా గొప్ప పేరు ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈమధ్యనే ఆయన రాం చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటే అది డైరెక్టర్ శంకర్ మాత్రమే. ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లో సంచలనాలు సృష్టించాయి. ఐతే ఈమధ్య ఫాం కోల్పోయినట్టు కనిపిస్తున్న శంకర్ కమల్ తో తీసిన ఇండియన్ 2 తో పాటు రామ్ చరణ్ తో చేసిన గేమ్ ఛేంజర్ తో కూడా ఫెయిల్యూర్ అందుకున్నారు.

ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 17న ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు కింద శంకర్ కు చెందిన 10.11 కోట్ల 3 స్థిరాస్తులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. ఐతే ఈ కేసు విషయమై పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.