Begin typing your search above and press return to search.

ఆ హిట్ మూవీ రీమేక్‌ క్యాన్సల్‌.. డైరెక్టర్‌ తేల్చేశాడు

సౌత్ లో హిట్ అయిన పలు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   8 July 2024 12:30 PM GMT
ఆ హిట్ మూవీ రీమేక్‌ క్యాన్సల్‌.. డైరెక్టర్‌ తేల్చేశాడు
X

సౌత్ లో హిట్ అయిన పలు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో కొన్ని పాత సౌత్ సినిమాలను కూడా హిందీలో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారు. అందులో ఒకటి అపరిచితుడు. బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా శంకర్ అపరిచిత్‌ ను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా హిందీ ప్రేక్షకులకు అపరిచిత్‌ ను చేరువ చేయవచ్చు అని దర్శకుడు శంకర్‌ భావించాడు. అధికారికంగా సినిమాను ప్రకటించడం కూడా జరిగింది. కానీ గత కొన్నాళ్లుగా సినిమా గురించి ఎలాంటి హడావుడి లేక పోవడంతో సినిమా రద్దు అయ్యిందని అంతా భావిస్తున్నారు.

తాజాగా ఆ విషయమై దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చాడు. హిందీలో అపరిచిత్ సినిమా చేయాలని అనుకున్నాం. అందుకు సంబంధించిన ప్రకటన కూడా చేశాం. కానీ అపరిచిత్ కంటే ఇంకా పెద్దగా ఏమైనా చేయాలని మా నిర్మాతలు కోరుతున్నారు.

ప్రస్తుతానికి ఇండియన్‌ 2 సినిమా పైనే తమ దృష్టి ఉందని, ఆ తర్వాత ఇండియన్‌ 3 తో రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రస్తుతానికి తదుపరి సినిమా విషయంలో ఆలోచన లేదని, గేమ్‌ ఛేంజర్ సినిమా కూడా విడుదల అయిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుంది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.