'గేమ్ ఛేంజర్' పై ఇంపాక్ట్ అప్పుడే పడుతోందా?
రివ్యూలు నెగిటివ్ గా వచ్చినా? వాటితో పనిలేకుండా జనాదరణకు నోచుకుంటుంది.
By: Tupaki Desk | 29 Sep 2024 4:24 PM GMT'ఆర్ ఆర్ ఆర్' తర్వాత రిలీజ్ అయిన తారక్ తొలి సినిమా `దేవర` మొదటి భాగం దాదాపు గట్టేక్కిసినట్లే. సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడం..తొలి రోజే 172 కోట్లు రావడంతో తిరుగులేని వసూళ్లగా మారాయి. స్టిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రివ్యూలు నెగిటివ్ గా వచ్చినా? వాటితో పనిలేకుండా జనాదరణకు నోచుకుంటుంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రేసులో ఉంది `పుష్ప-2`.
ఈ సినిమా భారీ అంచనాల మధ్య డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. తొలి భాగం సక్సెస్ నేపథ్యంలో భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సినిమా తొలి రోజే ఆర్ ఆర్ ఆర్ డేవన్ వసూళ్లు క్రాస్ చేస్తుందనే అంచనాలు తెరపైకి వస్తున్నాయి. 200 కోట్ల వసూళ్లను సునాయాసంగా దాటేస్తుందంటున్నారు. ఈ సినిమాకు ఉన్న అన్ని వైపులా పాజిటివ్ గానే ఉంది. ఏదైనా చిన్న నెగిటివ్ ఉంది అంటే? అది పొలిటికల్ గా వచ్చిన వైరం తప్ప మరేం లేదు. అప్పటికీ ఆ పరిస్థితి కూడా సర్దుకుంటుందనే అంచనాలున్నాయి.
అయితే మెగాపవ్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న `గేమ్ ఛేంజర్` పై మాత్రం శంకర్ వైఫల్యాల ఇంపాక్ట్ కొంత వరకూ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత చరణ్ నుంచి రాబోతున్న చిత్రమిదే. ఆ సినిమా సెట్స్ లో ఉండగానే శంకర్ ని చరణ్ లాక్ చేసాడు. అయితే శంకర్ గత సినిమాలు సహా తాజాగా రిలీజ్ అయిన `ఇండియన్ -2` కూడా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
రొటీన్ సినిమా తీసారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో `గేమ్ ఛేంజర్` ఎలా ఉంటుందనే డిస్కషన్ ఫిలిం సర్కిల్స్ లో చర్చకొస్తుంది. శంకర్ ని ఈ కథని ఎంత కొత్తగా చూపిస్తాడు? చరణ్ ని తెరపై ఎలా చూపిస్తాడు? ఈసినిమా తొలి రోజు ఎలాంటి ఓపెనింగ్ లు సాధిస్తుంది? అనే చర్చ మొదలైంది. వీటన్నిం టిని శంకర్ అధిగమించాల్సి ఉంది. ఆయన సక్సెస్ లు కొడితే ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ రికార్డులే తునా తునకలైపోతాయి. అలాంటి సక్సెస్ గేమ్ ఛేంజర్ నుంచి ఉంటుందనే శంకర్ అభిమానులు ఆశిస్తున్నారు.