రోబో శంకర్.. లో బడ్జెట్ సినిమా..?
అలా శంకర్ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్ తో చేస్తే తప్పకుండా సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా హిట్లు గా నిలబడతాయి.
By: Tupaki Desk | 18 Jan 2025 11:30 AM GMTసౌత్ స్టార్ డైరెక్టర్ అయినా నేషనల్ లెవెల్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నారు శంకర్. సోషల్ మెసేజ్ ని కమర్షియల్ యాంగిల్ లో చెబుతూ ఆడియన్స్ కు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తారు ఆయన. అందుకే శంకర్ సినిమా అంటే చాలు చూస్తే థియేటర్ లోనే చూడాలి అనిపించేలా ఉంటాయి. ఐతే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన శంకర్ ఈమధ్య వరుస పరాజయాలు అందుకున్నారు. కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేసిన శంకర్ ఈమధ్యనే రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేశాడు.
సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఐతే శంకర్ సినిమా అంటే భారీతనం ఉండాల్సిందే. సినిమా లో కొన్ని ఎపిసోడ్స్ ప్రత్యేకంగా చెప్పుకునేలా ఆయన టేకింగ్ ఉంటుంది. అందుకే శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ అని నిర్మాతలు కూడా ఫిక్స్ అయ్యారు. శంకర్ తో సినిమా అంటే నిర్మాత బడ్జెట్ విషయంలో కాస్త భయాందోళన చెందుతాడు.
అఫ్కోర్స్ ముందు అనుకున్న బడ్జెట్ ఎంత భారీగా ఉన్నా దానికి మించి పోకుంటా ఉంటే బెటర్ అని అనుకుంటారు. ఐతే శంకర్ సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ అనే టాక్ పడిపోయింది. ఐతే అలా బడ్జెట్ ఎక్కువ అవ్వడం వల్ల సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా దాన్ని రికవర్ చేయడం కష్టం అవుతుంది. ఐతే శంకర్ ఒక లో బడ్జెట్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కొందరికి వచ్చింది.
సినిమా అంటే 300, 400 కోట్లు అన్నట్టు కాకుండా శంకర్ ఒక 100 కోట్ల లోపు సినిమా తీస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు. అలా శంకర్ సినిమా మీడియం రేంజ్ బడ్జెట్ తో చేస్తే తప్పకుండా సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా హిట్లు గా నిలబడతాయి. ఐతే వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసే శంకర్ నెక్స్ట్ సినిమా ఏదైనా ఒక లో బడ్జెట్ సినిమా తీస్తే ఎలా చేస్తాడని డిస్కస్ చేస్తున్నారు. అలాంటి సినిమా ఒకటి తీసి మరోసారి తన సత్తా చాటుకోవాల్సి ఉందని అంటున్నారు. ఐతే శంకర్ అసలు అలాంటి అటెంప్ట్ చేస్తారా లేదా అంత తక్కువ బడ్జెట్ అంటే సినిమా కష్టమని నో అంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా శంకర్ తక్కువ బడ్జెట్ సినిమా వస్తే మాత్రం ఆయన ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు.