Begin typing your search above and press return to search.

`గేమ్ ఛేంజ‌ర్` స‌క్సెస్ శంక‌ర్ అంత కీల‌క‌మా?

ఇండియ‌న్ 3కి లీడ్ ఇచ్చిన అంశం త‌ప్ప రెండ‌వ భాగంపెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 5:07 AM GMT
`గేమ్ ఛేంజ‌ర్` స‌క్సెస్ శంక‌ర్ అంత  కీల‌క‌మా?
X

ఒక‌ప్ప‌టి శంక‌ర్ వేరు. ఇప్ప‌టి శంక‌ర్ వేరు. అప్ప‌ట్లో శంక‌ర్ సినిమాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అంటూ అవును దేశ‌మంతా మాట్లాడుకుంటోంది. చాలా కాలంగా శంక‌ర్ మార్క్ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. `రోబో` త‌ర్వాత తెర‌కెక్కించిన `ఐ`, ` 2.0` అంచ‌నాలు అందుకోలేదు. దీంతో భార‌తీయుడికి సీక్వెల్ గా `ఇండియ‌న్ -2` ప్ర‌క‌టించి భారీ హైప్ తీసుకొచ్చారు. అదే అంచ‌నాల‌తో సినిమా రిలీజ్ అయినా? ఎలాంటి ఫ‌లితాలు సాధించింది అన్న‌ది తెలిసిందే.

ఇండియ‌న్ 3కి లీడ్ ఇచ్చిన అంశం త‌ప్ప రెండ‌వ భాగంపెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో ఈసినిమా ప్ర‌భావం `గేమ్ ఛేంజ‌ర్` పైనా ప‌డుతుంద‌నే ఊహాగానాలు మొద‌లయ్యాయి. రామ్ చ‌ర‌ణ్ ని తెర‌పై ఎలా ఆవిష్క‌రించ‌బోతున్నాడు? అన్న టెన్ష‌న్ అభిమానుల్లో చ‌ర్చ‌కు దారి తీస్తుంది. స్టోరీ లైన్ ఇప్ప‌టికే లీక్ అయింది. ఐఏఎస్ అధికారి రాజ‌కీ య‌నాయ‌కుడిగా మారితే ఎలా ఉంటుంది? అంశం ఆధారంగా తీస్తున్న‌ట్లు ప్ర‌చారం లో ఉంది. అయితే ఈ ఈ క‌థ‌ని శంక‌ర్ ఎలా మ‌లిస్తున్నారు? అన్న‌ది ఆసక్తిక‌రంగా మారింది.

`ఇండియ‌న్ -2` విజ‌యం సాధిస్తే ఈ టెన్ష‌న్ ఉండేది కాదు. ఆర‌కంగా ఇండియ‌న్ -2 ప్ర‌భావం గేమ్ ఛేంజ‌ర్ పై ప‌డింది. దీనికి తోడు మూడేళ్ల కాలంగా ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నారు. దీంతో బ‌డ్జెట్ కూడా త‌డిపి మోపుడ‌వుతుంద‌నే విమర్శలున్నాయి. వీట‌న్నింటికి శంక‌ర్ కేవ‌లం స‌క్సెస్ తోనే స‌మాధానం చెప్పాల్సి ఉంది. ఈ సినిమా స‌క్స‌స్ కూడా శంక‌ర్ కి అత్యంత కీల‌క‌మైందే. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతార‌ని అంతా ఆశిస్తున్నారు.

ఇప్ప‌టికే సూర్య‌, విక్ర‌మ్ తో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రానికి శంక‌ర్ స‌న్నాహాలు చేస్తున్నారు. దాదాపు 1000 కోట్ల బ‌డ్జెట్ తో ఈచిత్రాన్ని ఓన‌వ‌ల ఆధారంగా రెడీ చేస్తున్నారు. అయితే ఈసినిమా పై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డకూడ‌దు? అంటే గేమ్ ఛేంజ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాలి. లేదంటే? త‌దుప‌రి ప్రాజెక్ట్ విష‌యంలో మార్పులు చోటు చేసుకున్నా? ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న తెర‌పైకి వ‌స్తోంది.