ఇండియన్ 3 పూర్తి చేయక తప్పదు..!
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత శంకర్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే శంకర్ డైరెక్షన్ లో కమల్ హీరోగా ఇండియన్ 3 ని పూర్తి చేశారు.
By: Tupaki Desk | 5 April 2025 2:30 AMసౌత్ సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న దర్శకుడు శంకర్. ఆయన సినిమా అంటే చాలు ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఎలాంటి సినిమా తీసిన సరే శంకర్ డైరెక్షన్ లో సినిమా అంటే పక్కా హిట్ అనేలా క్రేజ్ తెచ్చుకున్నారు. ఐతే ఐ, 2.O సినిమాల వల్ల శంకర్ పై ఒక బ్లాక్ మార్క్ పడింది. ఆ తర్వాత అయినా పుంజుకుంటాడు అనుకుంటే అలా జరగలేదు సరికదా ఇంకాస్త గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు కూడా శంకర్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయి.
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత శంకర్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే శంకర్ డైరెక్షన్ లో కమల్ హీరోగా ఇండియన్ 3 ని పూర్తి చేశారు. సినిమాకు మరో 30 శాతం షూటింగ్ పెండింగ్ ఉంది. ఐతే కోలీవుడ్ లో భారీ సినిమాలు నిర్మించి వరుస ఫ్లాపులతో లైకా సంస్థ కూడా చాలా రిస్క్ లో పడింది. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ ఇండియన్ 3 చేయడానికి కూడా ఆసక్తి చూపించట్లేదు.
ఐతే ఇప్పటికే ఇండియన్ 3 మీద చాలా పెద్ద మొత్తం పెట్టి ఉన్నారు. సో పూర్తి చేయాల్సిన మిగతా పార్ట్ తక్కువ బడ్జెట్ లో త్వరగా చేస్తే ఆ సినిమా బిజినెస్ వల్ల అయినా కాస్త కూస్తో నష్టాన్ని పూడ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఐతే గేమ్ ఛేంజర్ రిలీజ్ టైం లోనే ఇండియన్ 2 బిజినెస్ లెక్కల వల్ల శంకర్ తో లైకా గొడవ తెలిసిందే. ఐతే ఇండియన్ 3 కోసం ఇద్దరు కాస్త వెనక్కి తగ్గక తప్పట్లేదు.
కమల్ హాసన్ కూడా ఇండియన్ 3 ని పూర్తి చేయాలని చూస్తున్నాడు. వాళ్లు అడిగిన డేట్స్ ఇచ్చేందుకు రెడీ అంటున్నాడు. మరి ఇండియన్ 3 ఎప్పటికి పూర్తవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది చూడాలి. ఇండియన్ 2 రిలీజ్ టైం లో సినిమా క్లైమాక్స్ లో ఇండియన్ 3 టీజర్ వదిలారు. షాకింగ్ ఏంటంటే ఇండియన్ 3 ట్రైలర్ ఆడియాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు లైకా సంస్థ, శంకర్ కలిసి పనిచేయనున్నారు. ఐతే చివరి ప్రయత్నంగా వీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.