'గేమ్ ఛేంజర్', 'ఇండియన్-3'పై శంకర్ కాన్ఫిడెన్స్ ఇలా!
పాన్ ఇండియాలో మరో చరిత్ర సృష్టించే అవకాశం ఉందని యావత్ భారత్ భావించింది.
By: Tupaki Desk | 19 Dec 2024 1:30 PM GMT'త్రీ ఇడియట్స్' తర్వాత శంకర్ కి సరైన సక్సెస్ పడలేదు. 'ఐ', '2.0', 'ఇండియన్ -2' సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా 'భారతీయుడు' సీక్వెల్ గా రూపొందిన 'ఇండియన్ -2' ప్రాజెక్ట్ ప్రకటించిన నాటి నుంచి శంకర్ మరో అద్భుతం చేయబోతున్నాడు? అనే అంచనాలు పీక్స్ కి చేరాయి. కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడు భాగమైన ప్రాజెక్ట్ కావడంతో? పాన్ ఇండియాలో మరో చరిత్ర సృష్టించే అవకాశం ఉందని యావత్ భారత్ భావించింది.
కానీ 'ఇండియాన్-2' వాటిని అందుకోవడంలో ఘోర వైఫల్యం చెందింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా పెట్టిన పెట్టుబడి కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక సినిమాకొచ్చిన నెగిటివ్ రివ్యూల గురించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ రివ్యూలపై శంకర్ జాతీయ మ్యాగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. 'ఇలాంటి నెగిటివ్ రివ్యూలు వస్తాయని అస్సలు ఊహించలేదు. కానీ ఒకే. 'ఇండియన్-3',' గేమ్ ఛేంజర్' చిత్రాలతో బెస్ట్ ఇస్తానంటూ' ధీమా వ్యక్తం చేసారు.
అలాగే 'ఇండియన్ 2' వైఫల్యం నేపథ్యంలో 'ఇండియన్ -3' ఓటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం కూడా పీక్స్ లో జరుగుతోంది. ఎలాగూ ప్లాప్ చిత్రం ఓటీటీతో మమా అనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా 'ఇండియన్ -3'ని నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని శంకర్ స్పష్టం చేసారు. అలాగే 'గేమ్ ఛేంజర్' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
'రామ్ చరణ్ రెండు పాత్రల్లోనూ ఎంతో గొప్పగా నటించారు. అతడి ఆహార్యం, లుక్ ప్రతీది ప్రేక్షకుడికి ప్రెష్ ఫీలింగ్ తీసుకొస్తుంది. చరణ్ రైతు లుక్...స్టైలిష్ యాక్షన్, డైలాగులు, డాన్సు అన్నీ ఆకట్టుకుంటాయి. రామ్ చరణ్ లైఫ్ లాంగ్ గుర్తిండిపోయే రోల్ ఇది. పాత్రల విషయంలో నేనెంతో సంతృప్తి చెందాను. ఇది పక్కా మాస్ కమర్శి యల్ ఎంటర్ టైనర్' అని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతవరకూ శంకర్ ఈ రెండు సినిమాల గురించి ఎక్కడా స్పందించలేదు. తొలిసారి ఆయన నుంచి ఆసక్తిర వ్యాఖ్యలు రావడంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది.