తెలుగు సినిమా సంప్రదాయాన్ని తప్పించిన శంకర్!
తెలుగు సినిమా అంటే అందులో కచ్చితంగా ఐంటం పాట ఉండాల్సిందే. దీన్ని దర్శకులు, హీరోలు, అభిమానులు ఓ కండీషన్ గా భావిస్తుంటారు.
By: Tupaki Desk | 20 Dec 2024 7:30 PM GMTతెలుగు సినిమా అంటే అందులో కచ్చితంగా ఐంటం పాట ఉండాల్సిందే. దీన్ని దర్శకులు, హీరోలు, అభిమానులు ఓ కండీషన్ గా భావిస్తుంటారు. ఎంతో కాలంగా వస్తోన్న ఆనవాయితీ ఇది. సినిమా ఎలా ఉన్నా సరే? సన్నివేశం డిమాండ్ చేసినా? చేయకపోయినా సరే రెండున్నర గంటల సినిమాలో ఒక్క ఐటం పాట మాత్రం తప్పక ఉండాల్సిందే. ఈ సంప్రదాయాన్ని తెలుగులో ఏ డైరెక్టర్ మిస్ అవ్వరు. ఒకవేళ మిస్ అయితే? అభిమానుల నుంచి విమర్శలకు సిద్దంగా ఉండాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ తో శంకర్ `గేమ్ ఛేంజర్` సినిమా చేస్తున్నారు. మరి అందులో ఐటం పాట ఉందా? లేదా? అన్నది ఇప్పుడు మెగా అభిమానుల్లో వాడి వేడి చర్చ. ఆ వివరాల్లోకి వెళ్తే? సాధారణంగా శంకర్ సినిమాల్లో ఐటం పాటలు ఉండవు. ఐటం భామ ఎక్కడా కనిపించదు. కానీ సినిమాలో భారీతనం కనిపిస్తుంది. పాటల కోసం కోట్ల రూపాయల సెట్లు వేయిస్తారు. ఆ పాటల్లో అద్భుతమైన్ గ్రాపిక్స్ ఉంటాయి. పాట డిమాండ్ చేసిందంటే? ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి అక్కడ పాట చిత్రీకరించి రావడం అన్నది శంకర్ స్టైల్.
అంతేగానీ ప్రత్యేకంగా ఐటం పాటలు మాత్రం ఆయన సినిమాల్లో ఎక్కడా కనిపించవు. ఇప్పటి వరకూ ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసారు. కానీ ఏ సినిమాలోనూ ఐటం పాట లేదు. అయితే ఇంతవరకూ ఆయన డైరెక్ట్ చేసింది కేవలం కోలీవుడ్ సినిమాలే. తెలుగు సినిమాలు డైరెక్ట్ చేయలేదు. మరి తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఐటం పాట టచ్ ఏమైనా ఇస్తున్నారా? అన్నది చూడాలి.
కానీ `గేమ్ ఛేంజర్` లో మాత్రం అలాంటి పాట ఉన్నట్లు ఇంత వరకూ ఎలాంటి సమాచారం లేదు. ఐటం పాట పెడితే అందుకోసం ప్రత్యేకంగా హాట్ బ్యూటీని రంగంలోకి దించుతారు. అలాంటి హడావుడి `గేమ్ ఛేంజర్` విషయంలో ఎక్కడా చోటు చేసుకోలేదు. ఇప్పటికే మెగా అభిమానుల్లో `పుష్ప-2`లో కిసిక్ తరహా ఐటం సాంగ్ మన హీరో సినిమాలో లేదంట! అనే చర్చ జరుగుతోంది. ఉంటే బాగుండని కొంత మంది అంటుంటే, శంకర్ సినిమాలో అందుకు ఛాన్సే లేదని ఫిక్సైపోయిన వాళ్లు మరికొంత మంది.