Begin typing your search above and press return to search.

మణిరత్నం Vs శంకర్.. ఆడియన్స్ ఏమంటున్నారు?

అయితే శంకర్ కొన్నాళ్లుగా తీస్తున్న సినిమాలు మిస్ ఫైర్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Nov 2024 7:54 AM GMT
మణిరత్నం Vs శంకర్.. ఆడియన్స్ ఏమంటున్నారు?
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మణిరత్నం, శంకర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ మూవీ లవర్స్ కు తమిళ సినిమాలపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది వాళ్లిద్దరేనని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఎంతో మందికి ఫేవరెట్ డైరెక్టర్లుగా మారారు. రోజా, బొంబాయి, సఖి, ప్రేమికుడు, జెంటిల్ మెన్ వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అయితే శంకర్ కొన్నాళ్లుగా తీస్తున్న సినిమాలు మిస్ ఫైర్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇండియన్-2తో డిజాస్టర్ అందుకున్నారు శంకర్. పేలవమైన కథతో కూడిన వీఎఫ్ ఎక్స్ కు గాను విమర్శలు ఎదుర్కొన్నారు. మరోవైపు, మణిరత్నం మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఆవిష్కరించుకోవడానికి ట్రై చేస్తున్నారు. దర్శకత్వ నైపుణ్యాలను పెంచుకుంటున్నారు. రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ తో డీసెంట్ హిట్ కొట్టారు.

ఇప్పుడు మణిరత్నం, శంకర్ భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ చేస్తుండగా.. విలక్షణ నటుడు కమల్ హాసన్ తో మణిరత్నం థగ్ లైఫ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఆ రెండు సినిమాల టీజర్లు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు రోజుల క్రితం విడుదలైన థగ్ లైఫ్ మూవీ టీజర్.. అన్ని వర్గాల సినీ ప్రియుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది.

క్యాస్టింగ్ పెర్ఫార్మెన్స్, స్టన్నింగ్ విజువల్స్, యాక్షన్ సీన్స్, గ్రిప్పింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. టీజర్ కు మెయిన్ అసెట్స్ గా మారాయి. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ప్రజెంట్ జనరేషన్ ను కూడా మెప్పించే టాలెంట్ మణిరత్నంకు ఉందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు, శంకర్- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ టీజర్ ను నిన్న సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు.

టీజర్ లో రామ్ చరణ్ వైవిధ్య పాత్రల్లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కానీ వావ్ అనేలా టీజర్ లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో థగ్ లైఫ్ టీజర్ తో కంపేర్ చేస్తున్నారు. మణిరత్నంను చూసి శంకర్ నేర్చుకోవాలని అంటున్నారు. తనను తాను శంకర్ అప్డేట్ చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. మరి థగ్ లైఫ్, గేమ్ ఛేంజర్ చిత్రాలు ఎలా ఉంటాయో చూడాలి.