Begin typing your search above and press return to search.

ఇండియన్ 2.. క్రేజ్ పెంచేలా శంకర్ మరో భారీ ప్లాన్

జూన్ 1న మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని చెన్నైలో నెహ్రూ స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిని చిత్ర యూనిట్ ఇన్వైట్ చేసిందంట.

By:  Tupaki Desk   |   25 May 2024 6:30 AM GMT
ఇండియన్  2.. క్రేజ్ పెంచేలా శంకర్ మరో భారీ ప్లాన్
X

సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ఇండియన్ 2. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. శంకర్, కమల్ కాంబోలో 28 ఏళ్ళ క్రితం వచ్చిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతోంది. సేనాపతి క్యారెక్టర్ ని ఈ సారి శంకర్ ఏ విధంగా తెరపై చూపించబోతున్నాడో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ద్ లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సిద్ధార్ధ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ని భారీగా చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది.

జూన్ 1న మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని చెన్నైలో నెహ్రూ స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవిని చిత్ర యూనిట్ ఇన్వైట్ చేసిందంట. అలాగే కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ తో ఇప్పటికే శివాజీ, రోబో, 2.ఓ సినిమాలు చేశారు. దీంతో శంకర్ పై రజినీకి ప్రత్యేక అభిమానం ఉంది. అలాగే కమల్, శంకర్ మంచి మిత్రులు కావడంతో ఆయన ఈవెంట్ కి రావడానికి ఒకే చెప్పారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ తెలుగులో చేస్తున్నారు. ఈ సినిమా కారణంతో వారి మధ్య మంచి బాండింగ్ ఉంది.

దీంతో చరణ్ తో పాటు మెగాస్టార్ కూడా ఇండియన్ 2 ఈవెంట్ కి రానున్నారు. వీరితో పాటు యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్, స్టార్ హీరో సిద్ధార్ద్ లు మూవీ యాక్టర్స్ గా ఈ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నారు. ఏకంగా ఐదు మంది స్టార్స్ ఒకే స్టేజ్ మీద కనిపిస్తే చూసేవారికి రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి. మరి ఈ ఈవెంట్ ఏ స్థాయిలో ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుందనేది వేచి చూడాలి.