శంకర్ పెండింగులో పెట్టిన రీమేక్ గురించి!
భారీ బడ్జెట్లతో భారీతనం నిండిన సినిమాలు తీయడంలో స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ సుప్రసిద్ధులు
By: Tupaki Desk | 3 July 2024 12:30 AM GMTభారీ బడ్జెట్లతో భారీతనం నిండిన సినిమాలు తీయడంలో స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ సుప్రసిద్ధులు. ప్రస్తుతం అతడు తెరకెక్కించిన భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ (చరణ్) విడుదలకు రావాల్సి ఉంది. వీటిలో తొలిగా కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆ సినిమా ప్రమోషన్స్ తో పాటు భారతీయుడు 3 నిర్మాణానంతర పనులు కూడా పూర్తి చేసే హడావుడిలో ఉన్నారు శంకర్. ఇప్పటికే భారతీయుడు 2 చిత్రీకరిస్తున్న సమయంలోనే భారతీయుడు 3ని కూడా పూర్తి చేసామని ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మాణానంతర పనులు పూర్తి చేసి ఇదే ఏడాదిలో ఈ సినిమాని కూడా విడుదల చేస్తారు.
మరోవైపు కొన్నేళ్ల క్రితం ప్రకటించిన అపరిచితుడు (అన్నియన్) హిందీ రీమేక్ సెట్స్‌పైకి వెళుతుందా లేదా? అన్నదానికి తాజా ప్రచార వేడుకలో శంకర్ సమాధానమిచ్చారు. అపరిచితుడు హిందీ రీమేక్ రద్దయింది. కానీ దాని స్థానంలో అంతకు మించిన పెద్ద చిత్రం చేయాలని నా నిర్మాతలు కోరారు. రణవీర్ సింగ్ తో అన్నియన్ మిస్సయినా కానీ, భారీ చిత్రం చేస్తాను.. అని శంకర్ అన్నారు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్, భారతీయుడు 3 వరుసగా రిలీజ్ చేయాల్సి ఉంది. తదుపరి రణవీర్ తో సినిమాపై దృష్టి సారిస్తానని శంకర్ స్పష్ఠతనిచ్చినట్టు తెలిసింది. మరోవైపు సింగం ఎగైన్, డాన్ 3 చిత్రాల్ని పూర్తి చేసి రణవీర్ కూడా శంకర్ కి అందుబాటులోకి రావాల్సి ఉంది.
శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు కాన్వాస్ ఇప్పటి పాన్ ఇండియా రేంజుకు సరిపోయే కాన్సెప్ట్ కాదని మేకర్స్ భావించడం వల్లనే డ్రాప్ అయినట్టు అర్థమవుతోంది. ఇటీవల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అగ్ర దర్శకులు ఏ సినిమా చేసినా పాన్ వరల్డ్ ని టచ్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి-బాహుబలి 2- ఆర్.ఆర్.ఆర్ - కల్కి 2989 లాంటి వైవిధ్యమైన పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్లు ఫిలింమేకర్స్ ఆలోచనా తీరును ఏ రేంజులో ప్రభావితం చేశాయో దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.