Begin typing your search above and press return to search.

'ర‌జ‌నీ-క‌మ‌ల్- క‌పూర్‌'ల‌తో శంక‌ర్ విశ్వం?

కమల్ హాసన్, రజనీకాంత్, అనిల్ కపూర్‌లతో శంకర్ ఫిల్మ్ యూనివర్స్ భారీ మల్టీస్టార‌ర్ ని నిర్మించాల‌ని ప్లాన్ చేసిందా

By:  Tupaki Desk   |   30 Jun 2024 12:52 PM GMT
ర‌జ‌నీ-క‌మ‌ల్- క‌పూర్‌ల‌తో శంక‌ర్ విశ్వం?
X

కమల్ హాసన్, రజనీకాంత్, అనిల్ కపూర్‌లతో శంకర్ ఫిల్మ్ యూనివర్స్ భారీ మల్టీస్టార‌ర్ ని నిర్మించాల‌ని ప్లాన్ చేసిందా? అంటే అవున‌నే స‌మాచారం. శంక‌ర్ సినిమాల థీమ్ అవినీతి ప్ర‌పంచాన్ని వ్య‌తిరేకించే హీరో చుట్టూ తిరుగుతుంది. అప‌రిచితుడు, శివాజీ: ది బాస్, ఒకే ఒక్క‌డు, జెంటిల్‌మన్, భారతీయుడు కొన్ని ఉదాహరణలు. భార‌తీయుడు 2 ఈ జాబితాలో చేర‌నుంది.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లేదా లోకివర్స్‌లో భాగమైన కైతి, విక్రమ్ , లియో విడుదలల తర్వాత అతడి అభిమానులు లోకి విశ్వాన్ని చూడాలనే కోరికను చాలా సంవత్సరాలుగా వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఇంట‌ర్వ్యూలో శంక‌ర్ మాట్లాడుతూ ''అస‌లు ఈ విశ్వాలేవీ (యూనివ‌ర్శ్ లు) వాడుకలోకి రాకముందే తనకు ఇలాంటి అరుదైన‌ యురేకా అనిపించే ఆలోచ‌న‌ మ‌న‌సులో ఉండేదని శంకర్ వెల్లడించారు. ''మీరు దీన్ని నమ్మరు. 2008లో రోబో సినిమా చేస్తున్నప్పుడు నా మ‌న‌సులో మెదిలింది... నేను భారతీయుడి నుండి సేనాపతి కమల్ హాసన్ , నాయక్ నుండి వన్ డే ముఖ్యమంత్రి అనీల్ క‌పూర్, శివాజీ నుంచి రజినీకాంత్ ని ఒకే చిత్రంలోకి తేవాలని అనుకున్నాను అని శంక‌ర్ గుర్తు చేసుకున్నారు. ఆ ముగ్గురితో మ‌ల్టీస్టార‌ర్ ఆలోచ‌న చేసాన‌ని అన్నారు.

ఈ ప్లాన్‌తో ఎగ్జ‌యిటింగ్ గా ఉన్నా కానీ.. చుట్టూ ఉన్న‌ బృందం నుండి స‌రైన‌ స్పందన రాక‌పోవడంతో త‌న ఆలోచ‌న స‌రైన‌ది కాద‌ని భావించార‌ట శంక‌ర్. అంద‌రినీ క‌లిపే ఈ వన్-లైనర్ నా మనసులోకి వచ్చింది. నేను ఆలోచనతో చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఫోన్ చేసి విషయం చెప్పాను. దాని గురించి వారు ఏమనుకుంటున్నారో అడిగాను. వారు నన్ను చూస్తూ పై నుండి క్రిందికి స్కాన్ చేసారు'' అని అతడు గుర్తు చేసుకున్నాడు. శంకర్ ఇంకా మాట్లాడుతూ..''వాళ్ళు అనుకున్నారు..అతడికి పిచ్చి పట్టిందా? ఒకే సినిమాలో ముగ్గురు స్టార్ల‌ను తీసుకురావాలనుకుంటున్నాడు!'' అని నాకో లుక్‌ ఇచ్చారు. వారి నుంచి నాకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. నేను ఏదో మూర్ఖంగా ఆలోచిస్తున్నానని అనుకున్నాను. కొంద‌రు సీనియర్ టెక్నీషియన్స్ దగ్గరకు కూడా వెళ్లాను. దర్శకుడికి చెడుగా అనిపించేది ఏదీ చెప్పకూడదని వారు బహుశా అనుకున్నారు. వారు నన్ను చూసి మృధువుగా నవ్వి వెళ్ళిపోయారు'' అని అన్నారు.

కొన్ని సంవత్సరాల తరువాత 'ది ఎవెంజర్స్' చూసినప్పుడు మ‌ళ్లీ విశ్వాన్ని సృష్టించాలనే త‌న ఆలోచనను గుర్తు చేసింది. నా మనసులో చాలా ఆలోచనలు వస్తాయి..నేను వాటిని నా కుటుంబం స్నేహితులతో పంచుకుంటాను. ఎవరూ నాకు సరిగ్గా స్పందించలేదు కాబట్టి, ఇది మంచి ఆలోచన కాదని నేను అనుకున్నాను. కొన్నాళ్ల తర్వాత అవెంజర్స్ వచ్చినప్పుడు ఆశ్చ‌ర్య‌పోయాను'' అని శంక‌ర్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో మీకు ఏదైనా సినిమా ఆలోచన ఉంటే, వెంటనే ఆ పని చేయాలని నేను నా సహాయకులకు చెబుతూ ఉంటాను. ప్రపంచంలో చాలా మంది సృజనాత్మక వ్యక్తులు ఉన్నారు. వారు నిరంతరం ఇలాంటి గొప్ప‌ విషయాలను ఊహించుకుంటారు. ఎవరికైనా ఆలోచన వస్తే మొదటి వ్యక్తిగా ఉండాలి! అని శంక‌ర్ సూచించారు.

భార‌తీయుడు 2, భార‌తీయుడు 3, గేమ్ ఛేంజర్ ఒకే విశ్వంలో భాగమని వాటి క‌థాంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని వార్తా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీని గురించి ఎటువంటి అధికారిక‌ నిర్ధారణ లేనప్పటికీ శంకర్ 2008 ఎపిసోడ్ త‌ర్వాత ఇంకా దానిపై ఆలోచిస్తున్నార‌నే భావిస్తున్నారు.

భార‌తీయుడు 2ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్ కిచ్లు, రకుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు నటించారు. జులై 12న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.