Begin typing your search above and press return to search.

లం**.. అయ్యో శంకర్ చెప్పింది బూతు పదం కాదు

భాషాప్రయోగం వలన కొన్ని మాటలు తప్పుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   8 July 2024 4:11 AM GMT
లం**.. అయ్యో శంకర్ చెప్పింది బూతు పదం కాదు
X

భాషాప్రయోగం వలన కొన్ని మాటలు తప్పుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తెలుగులో బూతులు అనుకున్న మాటలు వేరొక భాషలో స్పష్టమైన భావనతో ఉంటుంది. పదాలు పలికే విధానం ఒకే విధంగా ఉన్న అందులో ఉన్న సందర్భం, అభిప్రాయం భాషల్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆలోచన కరెక్ట్ గా ఉంటే అర్ధం చేసుకునే పద్ధతి మారుతుంది.

కొంతమంది ఇతర భాషలలో వాడే పదాలు తెలుగులో రాంగ్ సౌండ్ ని రిప్రజెంట్ చేస్తే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా భారతీయుడు 2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తో డైరెక్టర్ శంకర్ మాట్లాడుతున్నప్పుడు అలాంటి పదం ఉపయోగించాడు. దీంతో ఈ వీడియో క్లిప్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు.

శంకర్ భారతీయుడు 2 గురించి మాట్లాడుతూ సమాజంలో ప్రతి రోజు లం**( లంచం)… లంచం అని న్యూస్ వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి న్యూస్ చూసిన ప్రతిసారి నాకు సేనాపతి గుర్తుకొస్తాడు. సేనాపతి పాత్రని చూస్తే గూస్ బాంబ్స్ క్రియేట్ అవుతాయి. 28 ఏళ్ళ క్రితం సేనాపతి పాత్ర చూస్తే ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు కూడా అదే తరహా అనుభూతి థియేటర్స్ లో ప్రేక్షకులకి కలుగుతుంది. అని శంకర్ తెలిపారు.

శంకర్ లంచం అనే పదాన్ని తమిళ్ స్లాంగ్ తో (లం**) ఉచ్చరించాడు. దీంతో ఆ పదం సౌండ్ తెలుగులో అబ్యుజింగ్ వర్డ్ లా వినిపించింది. దీనిని నెటిజన్లు ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందులో ట్రోల్ చేయాల్సినంత ఏమీ లేదనే అభిప్రాయం కమల్, శంకర్ అభిమానులు అంటున్నారు. మనం బూతు అనుకునే ఆ పదాన్ని తమిళంలో లంచం గురించి చెప్పడానికి అలాగే వాడుతారని తెలుస్తోంది.

ప్రేక్షకులకి కూడా లంచం అనే మాట వినగానే శంకర్ భారతీయుడు 2, అపరిచితుడు సినిమాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అంతలా శంకర్ తన సినిమాలతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. జులై 12న రిలీజ్ కాబోయే మూవీ కూడా ఇండియన్ మూవీకి పెర్ఫెక్ట్ సీక్వెల్ అనేలా ఉంటుందనే అభిప్రాయం చిత్ర యూనిట్ నుంచి వ్యక్తం అవుతుంది. భారతీయుడు కంటే భారతీయుడు 2 అద్భుతంగా ఉంటుందని, ఈ రెండింటికి మించి భారతీయుడు 3 మూవీ కథాంశం ఉండబోతోందని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.