Begin typing your search above and press return to search.

అతని పవర్ ఏంటో తెలిసింది: శంకర్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు.

By:  Tupaki Desk   |   8 July 2024 7:28 AM GMT
అతని పవర్ ఏంటో తెలిసింది: శంకర్!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు రామ్ చరణ్ గొప్ప యాక్టర్ అని ప్రశంసించే స్థాయిని అందుకున్నాడు. రంగస్థలం ధృవ, ఆర్ఆర్ఆర్ సినిమాలు రామ్ చరణ్ లో పూర్తి స్థాయి యాక్టర్ ని బయటకి తీసుకొచ్చాయి. ఈ మూడు సినిమాలు మూడు వేరియేషన్స్ లో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఫస్ట్ టైం స్ట్రైట్ తెలుగులో చేస్తోన్న సినిమా కోసం రామ్ చరణ్ ని హీరోగా ఎంపిక చేసుకున్నారు. గేమ్ చేంజర్ మూవీని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించారు. ఈ మూవీకి సంబందించిన రామ్ చరణ్ పోర్షన్ అంతా కంప్లీట్ అయ్యిందంట. మరో 15 రోజుల షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందంట.

ఇది పూర్తయితే రిలీజ్ డేట్ పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా భారతీయుడు 2 మూవీ ప్రీరిలీజ్ వేడుకలో శంకర్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ఎప్పటి నుంచో స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్న అని, గేమ్ చేంజర్ తో ఇప్పుడు అది సాధ్యం అయ్యిందని శంకర్ తెలిపారు. రామ్ చరణ్ లో ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని, అతనిలో ఒక కంట్రోలింగ్ పవర్ ఉంటుందని, అది ఎప్పుడు బయటకొస్తుందా అనే క్యూరియాసిటీ ఉండేదని శంకర్ ప్రశంసలు కురిపించారు.

అతనితో వర్క్ గొప్ప అనుభూతిని అందించింది అని శంకర్ తెలిపారు. తన పోర్షన్ మొత్తం రామ్ చరణ్ కంప్లీట్ చేసేశారని క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా గేమ్ చేంజర్ బెస్ట్ మూవీ అవుతుందని శంకర్ అన్నారు. నిజానికి నేను ఒక సినిమా కంప్లీట్ చేసాక మరో సినిమా చేస్తున్నానని శంకర్ తెలిపారు. అయితే ఈ సారి మాత్రం కొన్ని పరిస్థితుల వలన మూడు సినిమాలు ఒకేసారి చేయాల్సి వచ్చిందని అన్నారు.

అయితే చాలెంజింగ్ గా తీసుకొని వర్క్ చేశానని, ఈ విషయంలో నా టీమ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉందని శంకర్ క్లారిటీ ఇచ్చాడు. గేమ్ చేంజర్ సినిమా అప్డేట్ గురించి ఎక్స్ పెక్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి శంకర్ అదిరిపోయే న్యూస్ అందించారు. అలాగే తన మాటలతో మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే పాన్ ఇండియా సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ పైచాలా హోప్స్ పెట్టుకున్నారు.