Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ శంక‌ర్ కొలువులో మిస్సింగ్ రైట‌ర్?

శంకర్ తెర‌కెక్కించిన‌ తదుపరి చిత్రం భార‌తీయుడు 2 జూలై 12న విడుదలకు సిద్ధంగా ఉంది.

By:  Tupaki Desk   |   10 July 2024 3:30 PM GMT
డైరెక్ట‌ర్ శంక‌ర్ కొలువులో మిస్సింగ్ రైట‌ర్?
X

శంకర్ తెర‌కెక్కించిన‌ తదుపరి చిత్రం భార‌తీయుడు 2 జూలై 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం 1996 బ్లాక్ బ‌స్ట‌ర్ భార‌తీయుడు (ఇండియ‌న్)కి సీక్వెల్ క‌థ‌తో రూపొందించిన సంగ‌తి తెలిసిందే. కమల్ హాసన్, సిద్ధార్థ్, ర‌కుల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కింది. ప్ర‌స్తుతం దర్శకుడు శంక‌ర్ ప్రమోషన్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో ఈ చిత్రం మొదటి భాగాన్ని రచయిత సుజాత రాసారని అయితే దురదృష్టవశాత్తు 2008లో ఆయ‌న‌ మరణించడంతో సీక్వెల్ లో మిస్స‌య్యార‌ని వెల్లడించాడు.

రచయిత సుజాత‌ తనకు తండ్రిలాంటి వార‌ని, ఆయ‌న‌ను మిస్ అవుతున్నానని శంక‌ర్ చెప్పారు. శంకర్ గతంలో సుజాతతో కలిసి ఇండియన్, జెంటిల్‌మన్, కాదల్‌, ఎంతిరన్ (రోబో) చిత్రాలకు పనిచేశారు. రచయిత మరణించిన తరువాత, శంకర్ తన చిత్రాలకు ప‌లువురు ఇతర రచయితలతో క‌లిసి ప‌ని చేసారు. జ‌ర్న‌లిస్ట్ జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్‌లతో కలిసి పనిచేశాడు.

కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న `ఇండియన్ 2` చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అత్యంత భారీగా విడుదలవుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సేనాపతి లేదా భారతీయుడి పోరాటం ఎలా సాగిందో తెర‌పై ఆవిష్క‌రించారు. క‌మ‌ల్ హాస‌న్ సేనాప‌తి పాత్రను మళ్లీ పోషించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు నటిస్తున్నారు. దీనికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు.

ఈ చిత్రానికి మూడవ భాగం కూడా తెర‌కెక్కుతోంది. ఇండియన్ 3 టాకీ షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంత‌ర ప‌నులు చేయాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ పాత్ర‌ మూడవ భాగంలో ప్ర‌ధానంగా ఉంటుంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం జనవరి 2025లో విడుదల కానుంది.