ఆయన అసంతృప్తి అందుకే మళ్లీ వెళ్తున్నారా?
తాజాగా కొన్ని సన్నివేశాలకు సంబంధించి శంకర్ రీ షూట్ కి వెళ్తున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 14 May 2024 1:30 AM GMTఆర్సీ 15 సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. అక్టోబర్ రిలీజ్ అవుతుందా? డిసెంబర్ కి తెస్తారా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. రిలీజ్ ఎప్పుడు? అన్నది షూటింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. పైగా శంకర్ సినిమా అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువగానే సమయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. తాజాగా కొన్ని సన్నివేశాలకు సంబంధించి శంకర్ రీ షూట్ కి వెళ్తున్నట్లు సమాచారం.
కొన్ని క్లోజప్ షాట్స్, అనుకున్న సన్నివేశాల్లో ఎక్కడ పర్పెక్షన్ కోల్పోయినా? శంకర్ ఏమాత్రం రాజీ పడరు. తాజాగా ఔట్ ఫుట్ చూసుకున్న శంకర్ చరణ్ సన్నివేశాలకు సంబంధించి అసంతృప్తి ఉండటంతో వాటిని మళ్లీ రీషూట్ చేయాలనుకుంటున్నారుట. అయితే వాటికోసం ఎక్కువ రోజులు సమయం కేటాయించాల్సిన పనిలేదుట. పది-పదిహేను రోజుల పాటు ఆ క్లోజప్ షాట్స్ కి సమయం కేటాయిస్తే సరిపోతుందని చిత్ర వర్గాల నుంచి లీకులం దుతున్నాయి. సాధారణంగా రీ షూట్లు అంటే ప్రతీ సినిమాకి తప్పనిసరే.
ప్రతీ దర్శకుడు పర్పెక్షన్ కోసం వెళ్తుంటారు. కానీ శంకర్ ఇంకాస్త డెప్త్ గా వెళ్తారు. ఈ కోవలోనే సమయం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. శంకర్ సినిమాలు రెండు..మూడు సంవత్సరాల పాటు షూటింగ్ చేయడానికి కారణం కూడా ఇలాంటివే. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సెట్స్ కివెళ్లి రెండేళ్లు అవుతుంది. ఇంత వరకూ రిలీజ్ అవ్వలేదని చరణ్ అభమానుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఒకానొక దశలో చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా రిలీజ్ అయినప్పుడు చూసుకుందాం అనేసారు.
కానీ గేమ్ ఛేంజర్ ఇప్పటికే 80 శాతం షూట్ పూర్తయింది కాబట్టి మరీ ఎక్కువగా సమయం పట్టకపోవచ్చు. ఇప్పటికే ఇండియన్-2 షూట్ పూర్తవ్వడంతో గేమ్ ఛేంజర్ ని స్పీడప్ చేసారు. కమల్ హాసన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులుచూస్తేనే మరోవైపు గేమ్ ఛేంజర్ కి టైమ్ కేటాయించి ముందుకెళ్తున్నారు.ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ పనులు కూడా హాంకాంగ్ బేస్డ్ కంపెనీకి అప్పగించారు. షూట్ తో పాటు ఆ పనులు కూడా శర వేగంగా జరుగు తున్నాయి.