ఇండియన్ 3 చర్చ ఇలా మొదలు...!
యూనివర్శిల్ హీరో కమల్ హాసన్, శంకర్ ల కాంబోలో రూపొందిన ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 12 July 2024 11:30 AM GMTయూనివర్శిల్ హీరో కమల్ హాసన్, శంకర్ ల కాంబోలో రూపొందిన ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతోంది. మధ్యలో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టినట్లు దర్శకుడు శంకర్ ప్రకటించాడు.
నిర్మాతలతో వచ్చిన విభేదాలను పరిస్కరించుకున్న శంకర్ ఇండియన్ 3 ని ముగించి నేడు విడుదల చేయడం జరిగింది. ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ సమయంలో ఇండియన్ 3 ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన కొంత షూట్ కూడా జరిగిందని శంకర్ ప్రకటించాడు.
ఆ మధ్య కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఇండియన్ 2 కంటే కూడా ఇండియన్ 3 పై ఆసక్తిగా ఉంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అది నిజమే అన్నట్లు ఇండియన్ 2 సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇండియన్ 2 పూర్తిగా నిరాశ పరిచింది. కంటెంట్ తో పాటు కథ విషయంలో కూడా దర్శకుడు పూర్తిగా నిరాశ పరిచాడు అంటూ రివ్యూలు వస్తున్నాయి. సినిమా కథ మొత్తం ఇండియన్ 3 లో ఉండే అవకాశాలు ఉన్నాయని అప్పుడే సీక్వెల్ కి సంబంధించిన చర్చ మొదలయ్యింది.
బ్రిటిష్ యుద్దం మరియు 75 ఏళ్ల క్రితం భారత్ ను ఇండియన్ 3 లో చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇండియన్ 3 ని 2025 లో విడుదల చేయబోతున్న శంకర్ ఆ సినిమాతో అయినా తన మార్క్ ను చూపించి సక్సెస్ కొట్టేనా చూడాలి.