Begin typing your search above and press return to search.

ఇండియన్ 2.. రెండు భాగాలకు అసలు కారణమిదే..?

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ జులై 12న థియేటర్స్ లోకి వచ్చింది

By:  Tupaki Desk   |   14 July 2024 6:48 AM GMT
ఇండియన్ 2.. రెండు భాగాలకు అసలు కారణమిదే..?
X

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ జులై 12న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాకి మొదటి రోజే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకుల నుంచి కూడా స్పందన అంతంత మాత్రంగానే ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో 28 ఏళ్ళ క్రితం వచ్చిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా కథాంశాన్ని ఇండియన్ తో పోల్చి చూడటం వలన ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కావడం లేదు. సినిమాలో ఎమోషన్ మిస్ అయ్యిందనే మాట బలంగా వినిపిస్తోంది.

శంకర్ సినిమాలు ప్రధానంగా పబ్లిక్ కి కనెక్ట్ అయ్యేది ఎమోషనల్ ఎలిమెంట్స్ ద్వారానే. ప్రతి కథలో కూడా బలమైన సామాజిక అంశాన్ని ఎంచుకొని, దానిని ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే విధంగా చేసి కమర్షియల్ జోనర్ లో చెప్పడం శంకర్ స్టైల్. అయితే శంకర్ చివరి సినిమాలైనా ఐ, 2.ఓ సినిమాలని గ్రాండియర్ గా తెరకెక్కించిన కూడా ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ కావడం వలన కమర్షియల్ సక్సెస్ కాలేదు.

ఇండియన్ 2 సినిమా విషయంలో కూడా శంకర్ మళ్ళీ అదే పొరపాటు చేసినట్లు తెలుస్తోంది. కథని గ్రాండియర్ గా చెప్పే క్రమంలో పబ్లిక్ కి కనెక్ట్ చేసే బేసిక్ ఎమోషన్స్ మిస్ చేశారనే మాట వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమా లైకా ప్రొడక్షన్స్ ప్రారంభంలో సోలోగా నిర్మించడానికి రెడీ అయ్యింది. అయితే బడ్జెట్ పరిమితి పెరిగిపోవడంతో మూవీ హోల్డ్ లో పడింది. దీంతో శంకర్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ స్టార్ట్ చేశాడు. కమల్ హాసన్ విక్రమ్ మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యింది.

దీంతో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్స్ కూడా ఇండియన్ 2 నిర్మాణ భాగస్వామిగా వచ్చింది. దీంతో ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల వరకు అయ్యిందంట. అంత పెద్ద బడ్జెట్ ఒక్క సినిమాతో రికవరీ చేయడం సాధ్యం కాదని నిర్మాతలు భావించడంతో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని చేయాలని భావించారంట. శంకర్ కూడా కథలో కొన్ని మార్పులు చేసి రెండు భాగాలకి సరిపడా కథాంశంతో ఇండియన్ 2, 3 సినిమాలని తెరకెక్కించారు.

కథని రెండు భాగాలుగా చేసే క్రమంలో అనవసరమైన సన్నివేశాలని ఎక్కువగా చేర్చినట్లు టాక్ వినిపిస్తోంది. రాజమౌళి అయితే కథకి కావాల్సిన ఎమోషన్స్ ని చాలా బలంగా చెబుతారు. ఈ విషయంలో శంకర్ ఫెయిల్ అయినట్లు సినిమా చూసిన వారి నుంచి వినిపిస్తోన్న మాట. అయితే బడ్జెట్ ని మ్యానేజ్ చేయడానికి కథని రెండు భాగాలుగా చేయడం వరకు బాగానే ఉన్న కంటెంట్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేయడంలో శంకర్ తడబడ్డారు. ఇది మొత్తం సినిమా ఫలితాన్ని మార్చేసింది. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ గా వచ్చిన ఆ టెంపోని ఇండియన్ 2 అందుకోలేక విఫలం అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ ఇండియన్ 3 మీద ప్రేక్షకుల అటెన్షన్ ని తగ్గించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.