Begin typing your search above and press return to search.

అనిరుద్‌ సంగీతానికి శంకర్‌ ఇచ్చిన మార్కులు..!

తాజా మీడియా సమావేశంలో దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ సంగీత దర్శకుడు అనిరుద్‌ వర్క్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 1:30 PM GMT
అనిరుద్‌ సంగీతానికి శంకర్‌ ఇచ్చిన మార్కులు..!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఇండియన్‌ 2' సినిమా విడుదలకు ముస్తాబయ్యింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇండియన్ 2 సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది.

ఇటీవలే ఇండియన్ 2 మ్యూజికల్‌ ఆల్బం ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయడం జరిగింది. మొత్తానికి సినిమా పై అంచనాలు పెంచే విధంగా పాటలు ఉన్నాయంటూ తమిళ మీడియాతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు తెగ మాట్లాడేస్తున్నారు. తెలుగు లో మాత్రం ఇంకా పాటలు ఎక్కలేదు.

తెలుగు లో సినిమా విడుదల అయిన తర్వాత ఏమైనా పాటలు ఎక్కుతాయో చూడాలి. దర్శకుడు శంకర్‌ గతంలో ఏఆర్‌ రహమాన్ తో వర్క్ చేసిన విషయం తెల్సిందే. కొన్ని కారణాల వల్ల ఈసారి కి అనిరుద్‌ తో వర్క్ చేయాల్సి వచ్చింది అనేది తమిళ మీడియా వర్గాల కథనం.

తాజా మీడియా సమావేశంలో దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ సంగీత దర్శకుడు అనిరుద్‌ వర్క్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే అనిరుద్‌ పలు సినిమాలకు సూపర్‌ హిట్ మ్యూజిక్ ఆల్బమ్‌ ను అందించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. శంకర్‌ వద్ద కూడా మంచి మార్కులను అనిరుద్‌ సొంతం చేసుకున్నాడు.

శంకర్ మాట్లాడుతూ... నేను అనుకున్న దాని కంటే కూడా బెటర్ గా సాంగ్స్ ఇచ్చాడు. ఒక పాట ను కంపోజ్‌ చేశాక ఎలా ఉందని అడిగి 80 శాతం ఓకే అంటే వంద శాతం ఇస్తానంటూ మళ్లీ మళ్లీ ఇచ్చేవాడు. నేను అనుకున్నట్లుగా సంగీతం వచ్చింది, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ కూడా బాగుంటుందని శంకర్ అన్నాడు. మొత్తానికి లెజెండ్రీ దర్శకుడి నుంచి అనిరుద్‌ మంచి మార్కులు దక్కించుకున్నాడు.