Begin typing your search above and press return to search.

రాజ‌మౌళి..ప్ర‌శాంత్ నీల్ మ‌ధ్య‌లో ఆయ‌న ప్లాన్ ఏంటి?

గ‌తంలో శంక‌ర్ భారీ విజ‌యాలు అందించినా...ఈ జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుల‌తో పొల్చితే ఆయ‌న వెనుకుబ‌డిన‌ట్లే క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Jan 2024 1:30 PM GMT
రాజ‌మౌళి..ప్ర‌శాంత్ నీల్ మ‌ధ్య‌లో ఆయ‌న ప్లాన్ ఏంటి?
X

పాన్ ఇండియా డైరెక్ట‌ర్ శంక‌ర్ కి కొంత కాలంగా స‌రైన విజ‌యాలు లేని సంగ‌తి తెలిసిందే. 'రోబో' త‌ర్వాత చేసిన సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. భారీ బ‌డ్జెట్ తో నిర్మాణం జ‌రిగిన సినిమాలు తీవ్ర న‌ష్టాలే తెచ్చిపెట్టాయి. ఈ నేప‌థ్యంలో శంక‌ర్ తో సినిమా అంటే కోలీవుడ్ నిర్మాత‌లు బ‌య‌ప‌డే స‌న్నివేశం ఎదురైంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో 'గేమ్ ఛేంజ‌ర్' లాక్ అవ్వ‌డం..ప‌ట్టాలెక్క‌డం అంతా ఒకేసారి వేగంగ జ‌రిగిపోయింది. అటుపై కొన్ని నెల‌ల‌కి ఆగిపోయిన ఇండియ‌న్ -2 కూడా రీస్టార్ట్ అయింది.

మొత్తంగా శంక‌ర్ ఆ రెండు సినిమాల‌తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్లాన్ లో ఉన్నారు. అయితే శంక‌ర్ కిది అగ్ని ప‌రీక్ష అనే అనాలి. పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు ఓ రేంజ్ లో స‌త్తా చాటుతున్నాయి. వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్నాయి. అలాగే కోలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలెన్నో ఉన్నాయి. రాజ‌మౌళి..ప్ర‌శాంత్ నీల్..సుకుమార్..లొకేష్ క‌న‌గ‌రాజ్ లాంటి వారు పాన్ ఇండియాలో దూసుకు పోత న్నారు. గ‌తంలో శంక‌ర్ భారీ విజ‌యాలు అందించినా...ఈ జ‌న‌రేష‌న్ ద‌ర్శ‌కుల‌తో పొల్చితే ఆయ‌న వెనుకుబ‌డిన‌ట్లే క‌నిపిస్తోంది.

ఆయ‌న‌పై ఉన్న బడ్జెట్ ప‌రంగా ఉన్న‌ వ్య‌తిరేక‌త‌..ప‌రాజ‌యాలు..న‌ష్టాలు అన్నింటిని పోలిక చేస్తే ఆ మాట వాస్త‌వం అనక త‌ప్ప‌దు. మ‌రి ఈ ప‌రిస్థితి నుంచి ఆయ‌న ఎలా బ‌య‌ట ప‌డాలంటే? ఆయ‌న నుంచి రిలీజ్ అయ్యే మూడు సినిమాల్లో రెండు క‌చ్చితంగా భారీ విజ‌యాలు న‌మోదు చేయాల్సిందే. సమ్మర్‌ తర్వాత భారతీయుడు 2 రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది ఆ సినిమా.

ఇది రెండు భాగాలు అని అంటున్నారు. ఈ లెక్కన 2024 సమ్మర్‌లో పార్ట్ 2 వస్తే.. 2025 సంక్రాంతికి ఇండియన్ 3 ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపు 2024 సెప్టెంబర్‌లో గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరికి వచ్చేసింది. 2024 సమ్మర్ టూ 2025 సంక్రాంతి మధ్య.. అంటే 10 నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో శంక‌ర్ రాబోతున్న‌ట్లు లెక్క‌లోకి వ‌స్తోంది. వాటిలో రెండు భారీ విజ‌యాలు సాధిస్తే శంక‌ర్ అగ్నీ ప‌రీక్ష పాస్ అయిన‌ట్లే.