2026 లో స్టార్ డైరెక్టర్ కొత్త కథతోనే!
స్టార్ డైరెక్టర్ శంకర్ లైనప్ ఇదేనా? 2026 వరకూ ఆయన షెడ్యూల్ ఫిక్సైపోయిందా? అంటే అవుననే కోలీవుడ్ వర్గాలంటున్నాయి.
By: Tupaki Desk | 14 April 2024 11:30 PM GMTస్టార్ డైరెక్టర్ శంకర్ లైనప్ ఇదేనా? 2026 వరకూ ఆయన షెడ్యూల్ ఫిక్సైపోయిందా? అంటే అవుననే కోలీవుడ్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ కథానాయకుడిగా `ఇండియన్ -2` షూటింగ్ పూర్తి ముగించి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఓవైపు ఆ పనులు చూసుకుంటూనే శంకర్ `గేమ్ ఛేంజర్` షూట్ కి హాజరవుతున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే `గేమ్ ఛేంజర్` పోస్ట్ ప్రొడక్షన్ పనులపై రిలీజ్ అనేది ఆధారపడి ఉంది.
ఎలా లేదన్నా `గేమ్ ఛేంజర్` ఈడాది రిలీజ్ అవుతుంది. దీంతో శంకర్ ఆ సినిమా నుంచి డిసెంబర్ కల్లా బయటకు వచ్చేస్తాడు. అటుపై `ఇండియన్ -3` షూట్ లో పాల్గొంటారు. ఆ సినిమాకి సంబంధించి కొంత భాగం షూటింగ్ జరిగింది. అంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే పెండింగ్ పనులు..పోస్ట్ ప్రొడక్షన్ 2025 లో పూర్తవుతుంది. అదే ఏడాది ఆ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అనంతరం శంకర్ బాలీవుడ్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రణవీర్ సింగ్ తో `అపరిచితుడు` సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ మాతృక నిర్మాతతో వివాదం కారణంగా ఇక ఈ ఆసీక్వెల్ లేనట్లేనని తాజాగా అందుతోన్న సమాచారం. ప్రత్యామ్నాయంగా రణవీర్ తో కొత్త కథతోనే ముందుకెళ్లేలా సన్నాహాలు చేస్తున్నారుట. శంకర్ రైటింగ్ టీమ్ ని ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్ విషయంలో అన్నీ అనుకున్నట్లు గనుక జరిగితే 2026లో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళ దర్శకులంతా బాలీవుడ్ వైపు చూస్తోన్న తరుణమిది.
ఇటీవలే మురగదాస్ కూడా సల్మాన్ తో సికందర్ ప్రాజెక్ట్ ప్రకటించారు. అలాగే సుధకొంగర కూడా హిందీలో ఓ సినిమా చేస్తున్నారు. అట్లీ సైతం 2025 లో హిందీలోనే మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈనేపథ్యంలో శంకర్ కూడా హిందీకి వెళ్లే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.