Begin typing your search above and press return to search.

శంకర్ మూడు సినిమాలు.. ఇంత స్పీడా?

ప్రస్తుతం శంకర్ ఓ వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 6:47 AM GMT
శంకర్ మూడు సినిమాలు.. ఇంత స్పీడా?
X

సౌత్ ఇండియాలో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న డైరెక్టర్ శంకర్. భారీ బడ్జెట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా శంకర్ పేరు వినిపిస్తోంది. రాజమౌళి కంటే ముందుగా శంకర్ పాన్ ఇండియా డైరెక్టర్ అనే బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అయితే చివరిగా అతని నుంచి వచ్చిన ఐ, రోబో 2.ఓ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.

ప్రస్తుతం శంకర్ ఓ వైపు కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీ చేస్తున్నారు, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలో ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. అలాగే ఈ రెండు పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. ఈ సినిమాలపై సౌత్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

తాజాగా ఇండియన్ 2 మూవీ నుంచి ఇంట్రో రిలీజ్ చేశారు. ఈ ఇంట్రో మూవీ కాన్సెప్ట్ ని ఎలివేట్ చేయడంతో పాటు భారతీయుడి పాత్రలో కమల్ హాసన్ క్యారెక్టర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియన్ సిరీస్ లు పార్ట్ 2తో పాటు పార్ట్ 3 కూడా రాబోతోంది. వచ్చే వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఇండియన్ 2 మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకి వచ్చేసింది. త్వరలో ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంపై గ్లోబల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 ఆరంభంలో ఇండియన్ 3 మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కేవలం 10 నెలల గ్యాప్ లోనే శంకర్ నుంచి మూడు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఈ సినిమాలు శంకర్ కెరియర్ ని డిసైడ్ చేయనున్నాయి. ఈ మూవీ హిట్ అయితే మాత్రం రాజమౌళి తరహాలో అతని ఇమేజ్ హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోతుంది. ఏ మాత్రం తేడా కొట్టిన కూడా శంకర్ కెరియర్ కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.