Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో లవ్లీ పాప గుర్తుపట్టారా?

ప్రేమకథాచిత్రమ్ రీమేక్ గా ఆ సినిమా తెరకెక్కింది. కన్నడంలో కూడా చంద్రలేఖ సూపర్ హిట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 5:23 AM GMT
పొట్టి గౌనులో లవ్లీ పాప   గుర్తుపట్టారా?
X

నార్త్ బ్యూటీస్ కి సౌత్ ఇండియాలో ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. చాలా కాలంగా ఎంతో మంది నార్త్ ముద్దుగుమ్మలు సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా సత్తా చాటారు. ఇక లవ్ లీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన బ్యూటీ శాన్వీ శ్రీ వాస్తవ. తరువాత అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే సినిమాలలో శాన్వీ శ్రీవాస్తవ హీరోయిన్ గా చేసింది. చంద్రలేఖ మూవీతో కన్నడంలోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది.


ప్రేమకథాచిత్రమ్ రీమేక్ గా ఆ సినిమా తెరకెక్కింది. కన్నడంలో కూడా చంద్రలేఖ సూపర్ హిట్ అయ్యింది. దాంతో కన్నడనాట శాన్వీ వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో అవకాశాలు రాకపోయిన కన్నడంలో మాత్రం స్టార్ హీరోలతో శాన్వీ జతకట్టింది. కేజీఎఫ్ స్టార్ యష్ కి జోడీగా మాస్టర్ పీస్ అనే సినిమాలో శాన్వీ నటించింది.


అలాగే రక్షిత్ శెట్టితో అవనే శ్రీమన్నారాయణ మూవీలో నటించింది. ప్రస్తుతం కన్నడంలో ఒక మూవీ, మరాఠీలో ఒక సినిమా శాన్వీ చేస్తోంది. తెలుగులో గట్టిగా ప్రయత్నాలు చేసిన ఎందుకనో ఆశించిన స్థాయిలో శాన్వీ ఛాన్స్ లు అందుకోలేకపోయింది. ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటుంది.

హాట్ హాట్ ఫోటోషూట్ లు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి సోషల్ మీడియా కూడా వైరల్ అవుతాయి. తాజాగా వైట్ కలర్ గౌనులో శాన్వీ శ్రీవాస్తవ అదిరిపోయే లుక్స్ తో ఫోటోలని షేర్ చేసింది. ఈ పిక్స్ నెటిజన్లని ఇట్టే ఆకర్షిస్తున్నాయి. శాన్వీ గ్లామర్ కి ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే అనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి. ఓ స్టార్ హోటల్ ముందు స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్నట్లు ఈ ఫోటోలలో శాన్వీ కనిపిస్తోంది. రాండమ్ గానే వీటిని షూట్ చేసినట్లు అనిపిస్తోంది. ఏంజిల్ గా ఈ ఫోటోలలో ఆమె మెరిసిపోతుందని అంటున్నారు.