Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బీచ్‌ అందాలతో పోటీ పడుతున్న శాన్వి

తాజాగా బీచ్ లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అక్కడి అందాలను తన కెమెరాలో బంధిస్తూ ఫోటోలకు ఫోజ్‌ లు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   16 July 2024 3:00 AM GMT
పిక్ టాక్ : బీచ్‌ అందాలతో పోటీ పడుతున్న శాన్వి
X

తెలుగు ప్రేక్షకులకు లవ్లీ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శాన్వి శ్రీవాస్తవ. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటినా కూడా ఈ అమ్మడు ఇంకా సందడి చేస్తూనే ఉంది. తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల్లో నటించడం ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంది.

ఈ మధ్య కాలంలో తెలుగు కంటే కూడా ఎక్కువగా కన్నడ సినిమాలను చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో మాత్రం భాష తో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉంది. ఆకట్టుకునే అందం ఈమె సొంతం అంటూ మరోసారి నిరూపితం అయ్యింది.

తాజాగా బీచ్ లో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అక్కడి అందాలను తన కెమెరాలో బంధిస్తూ ఫోటోలకు ఫోజ్‌ లు ఇచ్చింది. బీచ్ అందాలతో పోటీ పడే విధంగా శాన్వి అందం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేయడంతోనే ఇప్పటికి కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ప్రస్తుతం మరాఠి సినిమాలో నటిస్తున్న శాన్వి త్వరలో మళ్లీ తెలుగు సినిమా చేయాలని ఆశ పడుతుంది. తెలుగు నెటిజన్స్ కూడా ఈమె అందమైన ఫోటో షూట్స్ ను చూసిన తర్వాత మళ్లీ ఈమె తెలుగు లో ఎప్పుడు నటిస్తుందో అంటూ ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

తెలుగు లో లవ్లీ తో పాటు అడ్డా, రౌడీ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పదేళ్లుగా టాలీవుడ్ కి దూరంగా ఉంటుంది. ఆ మధ్య ఒక మీడియం రేంజ్ సినిమాలో నటించే అవకాశం దక్కినా చివరి నిమిషంలో ఆ ఆఫర్‌ చేజారిందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై శాన్వి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.