Begin typing your search above and press return to search.

యంగ్ హీరో స‌ర‌స‌న స్టార్ హీరో వార‌సురాలు!

మ‌రికొన్ని సినిమాలు ఆన్ సెట్స్ లో ఉంగా..రెండు సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   8 Oct 2024 7:30 AM GMT
యంగ్  హీరో స‌ర‌స‌న స్టార్ హీరో వార‌సురాలు!
X

బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. `ట్వెల్త్ ఫెయిల్` త‌ర్వాత స్టోరీల ఎంపిక‌లో మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్ప‌టికే మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మ‌రికొన్ని సినిమాలు ఆన్ సెట్స్ లో ఉంగా..రెండు సినిమాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి. ఇందులో ఒక‌టి 'అంఖోన్ కీ గుస్తాన్ ఖియాన్' చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. దీన్ని సంతోష్ సింగ్ తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంత‌వ‌ర‌కూ ఎంపిక చేయ‌లేదు.

కొంత మంది భామ‌ల్ని ప‌రిశీలించారు గానీ ఎవ‌ర్నీ ఫైన‌ల్ చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో స్టార్ హీరో సంజ‌య్ క‌పూర్ వార‌సులు శ‌న‌య్య క‌పూర్ ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అమెతో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం. విక్ర‌మ్ స‌ర‌స‌న న‌టించ‌డానికి క‌పూర్ బ్యూటీ ఎంతో ఉత్సాహంగా ఉంద‌ని, ఈ నెల‌ఖ‌రు నుంచి షూటింగ్లో జాయిన్ అవుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. దీన్ని మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీగా తీర్చిదిద్దుతున్నారు.

ఇందులో అంధ సంగీత క‌ళాకారుడిగా విక్రాంత్ క‌నిపించ‌నున్నాడు. సినిమాలో ఎమోష‌న్ అత్యంత కీల‌కంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. హీరో-హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ స‌న్నివేశాలు ఎంతో హృద్యంగా డిజైన్ చేసిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ లో మ్యూజిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఆషీకి ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆ సినిమాలో ఎమోష‌న్ స‌క్సెస్ వైపు తీసుకెళ్లింది. ఇందులో అంత‌కు మించిన ఎమోష‌న్ బ‌లంగా పండుతుంద‌ని మేక‌ర్స్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అంధుడి పాత్ర‌లో విక్రాంత్ మాస్సే అద్భుతంగా న‌టిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ఇక విక్రాంత్ మాసే న‌టించిన `ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్` రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇందులో రాశీఖ‌న్నా న‌టిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు త‌మ రిపోర్ట్ లో తెలుస్తాయ‌ని రాశీఖన్నా ఎంతో ధీమా వ్య‌క్తం చేసింది. ఆమె వ్యాఖ్య‌ల‌తో రిలీజ్ అనంత‌రం అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతాయా? అన్న సందేహం క‌నిపిస్తుంది.