Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్లాక్ లో మెరుస్తోన్న శర్మ సిస్టర్స్‌

తాజాగా మరోసారి శర్మ సిస్టర్స్ అందాల ఫోటోలను షేర్‌ చేశారు. ఇద్దరు కూడా బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేశారు. ముఖ్యంగా ఐషా శర్మ యొక్క క్లీ వేజ్ షో మరియు నడుము అందంకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 4:30 PM GMT
పిక్ టాక్ : బ్లాక్ లో మెరుస్తోన్న శర్మ సిస్టర్స్‌
X

చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. రామ్ చరణ్ కి జోడీగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో నేహా శర్మకు టాలీవుడ్‌ లో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ లక్ కలిసి రాకపోవడంతో పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోలేక పోయింది.

హీరోయిన్‌ గా నేహా శర్మ పలు సినిమాల్లో భారీ విజయాలను సొంతం చేసుకోకున్నా కూడా సుదీర్ఘ కాలంగా కెరీర్‌ లో కొనసాగున్న విషయం తెల్సిందే. ఇప్పుడు నేహా శర్మ యొక్క సోదరి ఐషా శర్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.

సోషల్ మీడియాలో ఈ మధ్య ఐషా శర్మ అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సొంతంగా అందాల ఫోటో షూట్స్ ను షేర్‌ చేసే ఐషా శర్మ అప్పుడప్పుడు ఇలా సిస్టర్ తో కలిసి ఫోటో షూట్స్ మరియు సెల్ఫీ లను షేర్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా మరోసారి శర్మ సిస్టర్స్ అందాల ఫోటోలను షేర్‌ చేశారు. ఇద్దరు కూడా బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేశారు. ముఖ్యంగా ఐషా శర్మ యొక్క క్లీ వేజ్ షో మరియు నడుము అందంకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు పెద్దగా సినిమాలు చేయని ఈ అమ్మడు ముందు ముందు పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు ఉన్నాయి.

ఇక నేహా శర్మ మాత్రం ఈ మధ్య కాలంలో వెబ్‌ సిరీస్ ల వైపు అడుగులు వేస్తుందనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక హిందీ వెబ్‌ సిరీస్ కు గాను ఈమె ఓకే చెప్పిందట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.