Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ మేన‌కోడ‌లి వెన‌క బ‌ల‌గం

అయితే ష‌ర్మిన్ కేవ‌లం ఒకే ఒక్క సినిమాలో మాత్ర‌మే న‌టించిన డెబ్యూ న‌టి.

By:  Tupaki Desk   |   21 May 2024 6:34 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్ మేన‌కోడ‌లి వెన‌క బ‌ల‌గం
X

క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన `హీరామండి`లో క‌థ‌ను న‌డిపించే కీల‌క పాత్ర‌లో క‌నిపించింది ష‌ర్మిన్ సెగ‌ల్. కానీ త‌న న‌ట‌న‌, హావ‌భావాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ద‌ర్శ‌కుడి మేన‌కోడ‌లు కావ‌డంతోనే అవ‌కాశం ఇచ్చార‌ని క్రిటిక్స్ తీవ్రంగా విమ‌ర్శించారు.

అయితే ష‌ర్మిన్ కేవ‌లం ఒకే ఒక్క సినిమాలో మాత్ర‌మే న‌టించిన డెబ్యూ న‌టి. అంత‌కుముందు భ‌న్సాలీ చిత్రాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సిరీస్ హీరామండితో ఓటీటీలో ప్ర‌వేశించింది. నిజానికి ష‌ర్మిన్ ఇంకా వ‌న్ ఫిలిం వండ‌ర్ మాత్ర‌మే. త‌న నుంచి ఎక్కువ ఆశించ‌డం కూడా స‌రి కాదేమోన‌ని విశ్లేషించారు. అయితే భ‌న్సాలీ త‌న‌కు అలాంటి కీల‌క పాత్ర‌లో అవ‌కాశం ఇవ్వ‌డాన్ని ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోయారు. దీంతో మ‌రోసారి హిందీ చిత్ర‌సీమ‌లోని నెపోటిజం అనేది హాట్ టాపిక్ గా మారింది.

ష‌ర్మిన్ వ్యక్తిగత జీవిత గురించి త‌ర‌చి చూస్తే.. ఆమె వ్యాపారవేత్త అమన్ మెహతాను వివాహం చేసుకుంది. ఈ జంట తరువాత ముంబైలో పెద్ద రిసెప్షన్‌ను నిర్వహించ‌గా, చాలా మంది బాలీవుడ్ తారలు హాజ‌ర‌య్యారు. షర్మిన్ సెగల్ బేలా సెగల్ -దీపక్ సెగల్ దంపతులకు హిందూ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి బేలా సెగల్ .. భ‌న్సాలీ తెర‌కెక్కించిన‌ బ్లాక్ - దేవదాస్ వంటి చిత్రాలకు ఎడిట‌ర్ గా ప‌ని చేసారు. షర్మిన్‌కి సిమ్రాన్ సెగల్ అనే చెల్లెలు కూడా ఉంది.

వ్య‌క్తిగ‌త నేప‌థ్యం:

షర్మిన్ సెగల్ ప్రముఖ భారతీయ నటి, మోడల్, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టిస్ట్. 28 సెప్టెంబరు 1995న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన ఆమె తన ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించడానికి లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. షర్మిన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తర్వాత నటనలో త‌న‌ అభిరుచిని గ‌మ‌నించింది. అటుపై వినోద పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత షర్మిన్ విరామం లేకుండా షోబిజ్‌లో చురుగ్గా ఉన్నారు.

ప్రముఖ సినీ దర్శకుడు మోహన్ సెగల్ ఆమెకు తాత. మొదట్లో ష‌ర్మిన్ డాక్టర్ కావాలనే కోరికతో ఉండేది. కానీ 11వ తరగతిలోనే థియేటర్‌లో చేరి నటనపై ఆసక్తి పెంచుకుంది. మేనమామ భ‌న్సాలీ ప్రోత్సాహంతో నటనపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. 90 కేజీల బరువు ఉన్నా కానీ.. నటనపై త‌న‌కున్న అభిరుచి ఆమెను ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి అధిక బరువును తగ్గించడానికి ప్రేరేపించింది.

షర్మిన్ సెగల్ 2013లో గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి సహాయ దర్శకురాలిగా ప్రవేశించారు. ఆమె మేరీ కోమ్ (2014), బాజీరావ్ మస్తానీ (2015), గంగూబాయి కతియావాడి (2022)వంటి ఇతర ముఖ్యమైన చిత్రాలకు సహాయం చేసింది. 2019లో సంజయ్ లీలా బన్సాలీ చిత్రం మలాల్‌లో తన తొలి పాత్రతో నటనా ప్రపంచంలోకి ప్రవేశించింది. ఇందులో మీజాన్ జాఫ్రీతో కలిసి అస్తా త్రిపాఠి పాత్రను పోషించింది. ఈ చిత్రానికి విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ చిత్రంలో తన పాత్రకు షర్మిన్ ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైంది. 2022లో షర్మిన్ సెగల్ ZEE5 చిత్రం అతిథి భూతో భవలో ప్రతీక్ గాంధీతో కలిసి నేత్రా బెనర్జీ అనే ఎయిర్ హోస్టెస్ పాత్రను పోషించింది.

షర్మిన్ సెగల్ వ్యక్తిగత జీవితం

సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు, బాలీవుడ్ నటి షర్మిన్ సెగల్ కి పారిశ్రామికవేత్త అమన్ గుప్తాతో ఇటలీలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఆమె తన సోషల్ మీడియాలో ఈవెంట్ నుండి అనేక ఫోటోలను షేర్ చేసింది.