షారుక్- ప్రభాస్ ఆల్ ది బెస్టు చెప్పుకోలేదే!
ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే అంచనాలు సహజం. ఒకప్పుడు పోటీ వాతావరణంలో ఎవరి దారి వారిదే అన్నట్లు ఉండేది.
By: Tupaki Desk | 23 Dec 2023 12:30 PM GMTఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే అంచనాలు సహజం. ఒకప్పుడు పోటీ వాతావరణంలో ఎవరి దారి వారిదే అన్నట్లు ఉండేది. పోటా పోటీగా రిలీజ్ అవుతుంటే అంతే పోటీ వాతావరణం కనిపించేది. ఏ ఇద్దరి మద్యనైనా నువ్వా? నేనా? అన్న రేంజ్ లో సన్నివేశం కనిపించేది. కానీ ఇప్పుడా సన్నివేశం లేదు. ఎంత పెద్ద స్టార్..బాక్సాఫీస్ వద్ద పోటీ బరిలో ఉన్నా ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం చాలా కాలంగా చోటు చేసుకుంటుంది.
తమ సినిమా తో పాటు ఇతరుల చిత్రాలు కూబా బాగా ఆడాలని...మంచి వసూళ్లు సాధించాలని కుదిరితే మీడియా ముఖంగా..లేకపోతే సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పుకుంటున్నారు. కానీ ఇటీవల రిలీజ్ అయిన ఇద్దరు స్టార్లు షారుక్ ఖాన్...ప్రభాస్ మధ్య మాత్రం అలాంటి సన్నివేశం కనిపించలేదు. డిసెంబర్ 21న షారుక్ నటించిన `డంకీ` విడుదలైతే...డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన `సలార్` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి.
ఏ సినిమా ఫలితం ఎలా ఉంది? అన్న సంగతి పక్కనబెడితే ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఎక్కడా విష్ చేసుకుంది లేదు. ఎవరి స్టైల్లో వారు బాక్సాఫీస్ ముందుకు వచ్చేసారు. సాధారణంగా ఇలా ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే ఆ రోగ్యకరమైన వాతావరణాన్ని హీరోలే కల్పించాలి. ఇక్కడ ఆ ఛాన్స్ ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. ఇటీవలి కాలంలో షారుక్ ఖాన్ టాలీవుడ్ తోనూ ర్యాప్ ని మెయింటెన్ చేస్తున్నట్లు చెప్పారు.
కానీ కోలీవుడ్ మీద ఉన్నంత ప్రేమ టాలీవుడ్ మీద కనిపించలేదని ఓ వర్గం విమర్శ. ఈ విషయంలో ప్రభాస్ కూడా అలాగే వ్యవరహించాడు. తాను చెప్పకపోతేనేం..చిన్నవాడైన డార్లింగ్ షారుక్ ఖాన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చుగా అన్న విమర్శ తెరపైకి వస్తుంది. ప్రభాస్ కన్నా షారుక్ ఖాన్ చాలా సీనియర్. ప్రభాస్ ఎంత పాన్ ఇండియా స్టార్ అయినా షారుక్ ముందు ఓ మెట్టు కిందనున్న నటుడే. షారుక్ ఖాన్ లాంటి వాళ్లను స్పూర్తిగా తీసుకుని ఎదిగిన నటులెంతో మంది.