Begin typing your search above and press return to search.

ఆ మార్కెట్ లో ఆయన 'కింగ్' అంతే .. ఎవరు టచ్ చెయ్యలేరు!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇమేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో రెండు సార్లు వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ చాలా ఈజీగా అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:42 AM GMT
ఆ మార్కెట్ లో ఆయన కింగ్ అంతే .. ఎవరు టచ్ చెయ్యలేరు!
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇమేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో రెండు సార్లు వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ చాలా ఈజీగా అందుకున్నాడు. బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి నెక్స్ట్ సినిమాల విషయంలో వెయ్యి కోట్ల మార్క్ అందుకోవడం సాధ్యం కాలేదు. కాని షారుఖ్ ఖాన్ మాత్రం కేవలం తన ఇమేజ్ తోనే వెయ్యి కోట్ల మార్క్ కి రెండు సార్లు దాటాడు.

ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఏకంగా 50 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని అందుకున్న ఏకైక స్టార్ గా షారుఖ్ ఖాన్ నిలిచాడు. మరి ఏ బాలీవుడ్ స్టార్ ఈ మార్క్ ని టచ్ చేయలేకపోయారు. దీనిని బట్టి ఓవర్సీస్ లో కూడా షారుఖ్ ఖాన్ కలెక్షన్స్ షేర్ ఖాన్ గా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో చేసిన డంకీ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

ఈ మూవీ మీద పాజిటివ్ టాక్ ఉన్న నేపథ్యంలో మరోసారి వెయ్యి కోట్ల కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. అయితే భవిష్యత్తులో షారుఖ్ ఖాన్ కి బాలీవుడ్ లో బలమైన పోటీ ఇచ్చే స్టార్ గా రణబీర్ కపూర్ ఎదిగే అవకాశం కనిపిస్తోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఈ మూవీ అతని కెరియర్ లోనే రికార్డ్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇప్పటికే ఈ సినిమా ఏడువందల కోట్లకి పైగా కలెక్షన్స్ ని ప్రపంచ వ్యాప్తంగా సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఇప్పటి వరకు 24 మిలియన్ డాలర్స్ కి యానిమల్ కలెక్ట్ చేసింది. రణబీర్ కపూర్ కెరియర్ లో హైయెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇవని చెప్పొచ్చు. 200 కోట్ల వరకు వరకు ఓవర్సీస్ లోనే యానిమల్ కి వచ్చాయి. ఇవి మరింత పెరిగి 32 మిలియన్ డాలర్ల వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.

వీటిలో మెజారిటీ కలెక్షన్స్ నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్ నుంచి రాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో 3.25 మిలియన్ డాలర్స్ కలెక్ట్ అయ్యింది. యూకేలో, ఐర్లాండ్ లో 2 మిలియన్ డాలర్లు కలెక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్స్ బట్టి యానిమల్ సినిమా ఓవర్సీస్ లో ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాపై కొంత మంది విమర్శలు చేస్తోన్న కూడా చాల మంది మాత్రం అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ ఉన్నారు.