Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మొత్తాన్ని దించేసి సూప‌ర్ స్టార్ పెంచేసాడుగా!

1994లో రిలీజ్ అయిన‌ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ `లయన్ కింగ్` అప్పట్లో భారీ విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   12 Aug 2024 12:02 PM GMT
ఫ్యామిలీ మొత్తాన్ని దించేసి సూప‌ర్ స్టార్  పెంచేసాడుగా!
X

1994లో రిలీజ్ అయిన‌ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ `లయన్ కింగ్` అప్పట్లో భారీ విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా `ముఫాసా` తెర‌కెక్కుతోంది. ముఫాసా ల‌య‌న్ కింగ్ ఎలా అయ్యాడు? అన్న బ్యాక్ డ్రాప్ తో యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ థ్రిల్ల‌ర్ గా బారీ జెంకిన్స్ రూపొంది స్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న వ‌ర‌ల్డ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమా భార‌త్ లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. అయితే హిందీలో ముఫాసా డ‌బ్బింగ్ బాధ్య‌త‌లు షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీసుకుంది. షారుక్ తో పాటు అత‌ని కుమారులు ఆర్య‌న్ ఖాన్, అబ్ర‌మ్ ఖాన్ డ‌బ్బింగ్ చెబుతున్నారు. సింబ పాత్ర‌కు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ యువ ముఫాసాకు, ముఫాసా పాత్ర‌కు షారుఖ్ గాత్ర దానం చేసారు.

ముగ్గురు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డంతో నార్త్ రీజియ‌న్ లో మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే ఈసినిమాకి షారుక్ ఖాన్ ఎంత‌గా క‌నెక్ట్ అయ్యారు? అన్న‌ది ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి తెలుస్తుంది. ముఫాసా పాత్ర నాకు బాగా కనెక్ట్ అయింది. ముఫాసా బాల్యం నుంచి రాజుగా ఎదగడం ఒక గొప్ప కథగా ఉంటుంది. ఈ పాత్రని చాలా గొప్ప‌గా చూపించారు.

డిస్నీతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ప్రయాణంలో నాతో పాటు నా కుమారులు భాగం అవడం సంతోషంగా ఉండి. ముఫాసా పాత్ర అందరికి స్ఫూర్తినిస్తుంది` అని అన్నారు. ఇక తెలుగు ల‌య‌న్ కింగ్ లోని సింబా పాత్ర‌కు నేచుర‌ల్ స్టార్ నాని డ‌బ్బింగ్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇత‌ర భాష‌ల్లో సైతం టాప్ స్టార్లు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డంతో సినిమాకి మంచి బ‌జ్ క్రియేట్ అవుతుంది.