Begin typing your search above and press return to search.

గోల్డెన్ ఛాన్స్ అందుకున్న శ‌ర్వ‌రి

న‌జీరుద్దీన్ షా, వేదంగ్ రైనా, దిల్జిత్ దోసాంజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Feb 2025 6:19 AM GMT
గోల్డెన్ ఛాన్స్ అందుకున్న శ‌ర్వ‌రి
X

న‌జీరుద్దీన్ షా, వేదంగ్ రైనా, దిల్జిత్ దోసాంజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న‌ విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో మ‌రో మాస్ట‌ర్‌పీస్‌ను అందించాల‌ని డైరెక్ట‌ర్ ఇంతియాజ్ అలీ ప్లాన్ చేస్తున్నాడు. సినిమాను ఈ వేస‌విలో సెట్స్ పైకి తీసుకెళ్లి షూటింగ్ మొద‌లుపెట్టి నెక్ట్స్ ఇయ‌ర్ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

ఇదిలా ఉంటే డైరెక్ట‌ర్ ఇంతియాజ్ అలీ ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర‌కు శ‌ర్వరి అయితే స‌రిగ్గా సెట్ అవుతుందని ఆమెను ఎంపిక చేశార‌ట చిత్ర మేక‌ర్స్. ఇంతియాజ్ రాసుకున్న పాత్ర‌కు శ‌ర్వ‌రి అయితేనే స‌రిగ్గా స‌రిపోతుంద‌ని అందరూ భావిస్తున్నార‌ట‌. శ‌ర్వ‌రి గురించి ఆడియ‌న్స్ కు ప్ర‌త్యేక ప‌రిచ‌యం చేయ‌నక్క‌ర్లేదు.

శ‌ర్వ‌రి గ‌త కొన్నేళ్లుగా బాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో న‌టించింది. ఆమె న‌టించిన సినిమాల్లో వేదా, బంటీ ఔర్ బబ్లీ2 మ‌రియు ముంజ్యా సినిమాలు బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. శ‌ర్వ‌రి న‌టించిన అన్ని సినిమాల్లో ముంజ్యా సినిమా మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్ ను వ‌సూలు చేయ‌డంతో పాటూ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లను కూడా అందుకుంది.

అయిన‌ప్ప‌టికీ శ‌ర్వ‌రి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అద్భుత‌మైన న‌ట‌న ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాలోనూ చూడలేదు. అయితే ఇంతియాజ్ అలీ ఎప్పుడూ త‌న సినిమాల్లో హీరోయిన్ పాత్ర‌ల‌పైనే ఎక్కువ దృష్టి పెడ‌తాడు. ఆయ‌న గ‌త సినిమాలు త‌మాషా, హైవే, జ‌బ్ వి మెట్, ల‌వ్ ఆజ్ క‌ల్ లో హీరోయిన్ పాత్ర బాగా హైలైట్ అయిన విష‌యం తెలిసిందే.

అలాంటి డైరెక్ట‌ర్ తో క‌లిసి పని చేయాల్సి రావ‌డం నిజంగా శ‌ర్వ‌రికి చాలా మంచి అవ‌కాశం. అమ్మ‌డు త‌న న‌ట‌న‌ను మొత్తం ఈ సినిమాలో చూపించే అవ‌కాశం వ‌చ్చిందంటే గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మ‌రి ఇంతియాజ్ అలీ చేస్తున్న ఈ హార్ట్ ట‌చింగ్ లవ్ స్టోరీని ఆడియ‌న్స్ ఎంత మేర‌కు మెచ్చుకుంటారో చూడాలి.