Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందమైన బాక్సింగ్ పంచ్‌ లతో...!

అందాల శర్వరి వాగ్‌ యొక్క ఈ బాక్సింగ్‌ ఫోజ్ పోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 July 2024 11:52 AM GMT
పిక్ టాక్ : అందమైన బాక్సింగ్ పంచ్‌ లతో...!
X

సినిమా ఇండస్ట్రీ లో అసిస్టెంట్‌ డైరెక్టర్ గా అడుగు పెట్టిన శర్వరి వాగ్ తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ లో 2020 సంవత్సరంలో స్ట్రీమింగ్‌ అయిన ది ఫర్గాటెన్‌ ఆర్మీ తో నటనలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు బంటీ ఔర్ బబ్లీ 2 తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.

నటిగా ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌ లకు కమిట్‌ అవుతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయంలో ఒక అడుగు ముందుకు వేసి నెటిజన్స్ ను మరియు తన ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు 'ఆల్ఫా' మూవీకి సిద్దం అవుతోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లో ఆలియా భట్ హీరోయిన్‌ గా నటిస్తుండగా శార్వరి కీలక పాత్రలో నటించబోతుంది. ప్రస్తుతం శర్వరి 'ఆల్ఫా' కోసం వర్కౌట్స్ మొదలు పెట్టింది.

తాజాగా ఈ ఫోటోలతో కన్నుల విందు చేసింది. మండే మోటివేషన్ అంటూ శర్వరి షేర్ చేసిన ఈ ఫోటోలు అమ్మాయిలకు ఆదర్శంగా నిలవడంతో పాటు, శర్వరి అందం ను మరింతగా చేసి చూపుతున్నాయి అనే కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి రోజు వర్కౌట్స్ చేస్తే ఫిట్‌ గా ఉంటారు అనే సందేశాన్ని ఇచ్చింది.

అందాల శర్వరి వాగ్‌ యొక్క ఈ బాక్సింగ్‌ ఫోజ్ పోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయి అందాల ఆరబోత బాక్సింగ్‌ కిక్ తో చేయడం చాలా విభిన్నంగా ఉందని, అందమైన ఈ బాక్సింగ్‌ ఫంచ్ లు మా పై పడితే లక్కీ మేము అన్నట్టుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరో వైపు నిఖిల్‌ అద్వానీ వేదాలో కూడా శర్వరి హీరోయిన్ గా నటిస్తోంది. ది రైల్వే మెన్‌ ఫేమ్‌ శివ్‌ రవైల్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతోంది. భవిష్యత్తులో శర్వరి సౌత్‌ లో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అన్నట్లు ఉందట.