ఆమె కోసం ఆరుగురు మేకప్ ఆర్టిస్ట్ లు 5 గంటలు..!
తాజాగా ముంజ్యాలోని తన పాత్ర కోసం పడ్డ కష్టం గురించి ఒక ఇంటర్వ్యూలో శార్వరీ మాట్లాడుతూ... బెలా పాత్ర కోసం నేను ఏకంగా అయిదు గంటలు మేకప్ వేయించుకోవాల్సి వచ్చేది.
By: Tupaki Desk | 4 July 2024 6:03 AM GMTగత నెల 7వ తారీకున బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు చిన్న సినిమాగా వచ్చిన 'ముంజ్యా' కి అనూహ్య విజయం దక్కింది. మూడు వారాల్లోనే ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టడం ద్వారా ముంజ్యా సినిమా అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా ముంజ్యా సినిమా గురించి చర్చ జరుగుతోంది.
ముంజ్యా సినిమాలో శార్వరీ వాఘ్ కీలక పాత్రలో నటించింది. అంతకు ముందు వరకు ఈమె గురించి ఇండస్ట్రీలో కొద్దిమందికి తప్ప ఎక్కువ శాతం మందికి తెలియనే తెలియదు. కానీ ఇప్పుడు ముంజ్యా స్టార్ గా శార్వరి అందరికి సుపరిచితం అయ్యింది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూ ఇస్తోంది.
కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి చెప్పడంతో పాటు, ముంజ్యా సినిమా కోసం తాను పడ్డ కష్టం గురించి కూడా కథలు కథలుగా చెబుతుంది. హర్రర్ నేపథ్యంలో రూపొందిన ముంజ్యా సినిమాలో ఆకట్టుకునే కామెడీ కూడా ఉండటం వల్ల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
తాజాగా ముంజ్యాలోని తన పాత్ర కోసం పడ్డ కష్టం గురించి ఒక ఇంటర్వ్యూలో శార్వరీ మాట్లాడుతూ... బెలా పాత్ర కోసం నేను ఏకంగా అయిదు గంటలు మేకప్ వేయించుకోవాల్సి వచ్చేది. ఆరుగురు అయిదు గంటలు కష్టపడి నాకు ప్రతి రోజు మేకప్ వేసేవారు, షూటింగ్ తర్వాత ఆ మేకప్ తీయడానికి దాదాపు అరగంట నుంచి గంట సమయం పట్టేదని వెళ్లడించింది.
శార్వరీ ఈ సినిమాలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది అంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదిత్య సర్పోత్దర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోగా అభయ్ వర్మ నటించాడు. ఆయనకి కూడా ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.