Begin typing your search above and press return to search.

ఆ హీరో కోసం నందమూరి, కొణిదెల కాంబో..

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కచ్చితంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 6:54 AM GMT
ఆ హీరో కోసం నందమూరి, కొణిదెల కాంబో..
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లిస్ట్ లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కచ్చితంగా ఉంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఫీల్ గుడ్ మూవీస్ తో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. గతేడాది మనమే మూవీతో వచ్చిన ఆయన.. ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.

సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజుతో ప్రస్తుతం శర్వానంద్ ఓ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ టైటిల్ శర్వా 37తో రూపొందుతున్న ఆ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

ఎమోషనల్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న శర్వా 37 ప్రాజెక్ట్ కు విశాల్ చంద్రశేఖర్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య కేరళలో బిగ్ షూటింగ్ షెడ్యూల్ పూరైనట్లు ప్రకటించిన మేకర్స్.. గ్రూప్ పిక్ ను పోస్ట్ చేసి సందడి చేశారు.

తాజాగా సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సంక్రాంతికి కానుకగా (జనవరి 14వ తేదీన) సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ను రివీల్ చేయనున్నట్లు తెలిపారు. నందమూరి అండ్ కొణిదెల ఫ్యామిలీ మెంబర్స్ తో లాంఛ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఎవరు రిలీజ్ చేస్తారో మాత్రం మేకర్స్ చెప్పలేదు. సస్పెన్స్ క్రియేట్ చేశారు.

ప్రస్తుతం శర్వా 37 మూవీ అప్డేట్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నందమూరి, మెగా, శర్వానంద్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతకుముందు.. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం రెడీగా ఉండండి అంటూ మేకర్స్ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ అందుకుంది.

పోస్టర్‌ లో చేతిలో బాక్సింగ్ గ్లౌజ్‌ లు పట్టుకున్న శర్వానంద్.. కోపంగా చూస్తున్నట్లు ఉన్నారు. పక్కనే రెండు బెంచీలు ఉండగా.. పోస్టర్ నెట్టింట తెగ వైరల్ గా మారింది. మొత్తానికి ఇప్పుడు శర్వా 37 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం సినీ ప్రియులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. మరి మేకర్స్ టైటిల్ ను ఏంటి ఫిక్స్ చేశారో... ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.