శర్వా.. మరో మంచి డైరెక్టర్ చేతిలో పడ్డాడు
ఇక నేడు అతని పుట్టినరోజు కావడంతో లైనప్ లో ఉన్న సినిమాల అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. మునుపటి తరహాలో కాకుండా శర్వా ఈసారి చాలా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 6 March 2024 12:49 PM GMTతెలుగు చిత్త పరిశ్రమలో మంచి లక్షణాలున్న కూల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు శర్వానంద్. ఇక నేడు అతని పుట్టినరోజు కావడంతో లైనప్ లో ఉన్న సినిమాల అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. మునుపటి తరహాలో కాకుండా శర్వా ఈసారి చాలా డిఫరెంట్ కథలను సెలెక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో మనమే అనే సినిమా చేస్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శర్వానంద్ కు 35 వ సినిమా. అలాగే యూవీ క్రియేషన్స్ లో 36వ సినిమా చేస్తున్నాడు. ఇది బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో రానుంది. అలాగే 37వ సినిమాపై కూడా శర్వానంద్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
గత ఏడాది సమాజవరగమన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర యొక్క ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వరుసగా శర్వా హిట్ కాంబినేషన్లో సినిమాలు చేస్తుండడం విశేషం.
ఇక అనౌన్స్‌మెంట్ పోస్టర్ లో శర్వానంద్ పొడవాటి జుట్టుతో గడ్డంతో సీరియస్ గా కనిపిస్తున్నాడు. కాస్త స్టైలిష్ గా కూడా కనిపిస్తున్నాడు. ఇదొక హై ఎనర్జిటిక్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న సినిమా అని తెలుస్తోంది. మంచి కామెడీ సీన్స్ ను హైలెట్ చేయగల దర్శకుడు రామ్, శర్వానంద్ ను కూడా సరికొత్తగా చూపించబొతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీత అందిస్తున్నారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తుండగా భాను బోగవరపు కథ అందించారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే శర్వా మంచి స్పీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అతని గత సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికి భారీ స్థాయిలో కమర్షియల్ గా కలెక్షన్స్ అయితే రాబట్టలేదు. అయినప్పటికీ టాలెంట్ తో శర్వా మంచి అవకాశాలు అందుకుంటూ ఉన్నాడు. మంచి కథనంతో శర్వాతో సినిమా తీస్తే తప్పకుండా హిట్టవుతాయి అని నిర్మాతలకు తెలుసు. అందుకే అతన్ని డిఫరెంట్ కంటెంట్ ఉన్న కథలలో సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.