మాస్ డైరెక్టర్ తో శర్వా నెవ్వర్ బిఫోర్ కథ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ఊర ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటుడు శర్వానంద్.
By: Tupaki Desk | 19 Sep 2024 3:56 AM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యభరితమైన పాత్రలతో తనకంటూ ఊర ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నటుడు శర్వానంద్. ఇక ఈ చార్మింగ్ స్టార్, ఇప్పుడు తన కొత్త సినిమాతో రెగ్యులర్ కు భిన్నంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటివరకు క్లాస్ క్యారెక్టర్స్ లలో ఎక్కువగా కనిపించిన శర్వా ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ మాస్ క్యారెక్టర్ తో రాబోతున్నాడు.
శర్వా 38 వ ప్రాజెక్టుగా తెరపైకి రానున్న ఈ సినిమా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటివరకు సంపత్ నంది తన ప్రత్యేకమైన స్టైల్ తో మాస్ ఎంటర్‌టైనర్స్ సినిమాలు చేశాడు. రామ్ చరణ్ రచ్చ, రవితేజ తో బెంగాల్ టైగర్, గోపిచంద్ తో గౌతమ్ నంద, సీటీమార్ లాంటి సినిమాలు చేశాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా క్లిక్కయ్యాయి.
మాస్ డైరెక్టర్ గా సంపత్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా శర్వా 38వ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఉత్తర తెలంగాణా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని 1960 దశక కాలంలో జరిగే కథ ఇది. ఈ కాలం తెలుగు సినిమాల్లో అలాంటి బ్యాక్ డ్రాప్ ను తక్కువగా చూపబడిన నేపథ్యంలో ఈ చిత్రం సరికొత్త అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. భయంతో నడిచే ప్రపంచంలో రక్తం అనేక సమస్యలకు పరిష్కారంగా నిలిచే కథ.. అని మేకర్స్ తెలిపారు.
ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడమే కాకుండా, శర్వా కూడా 1960ల కాలం పాత్రలో కనిపించడానికి ఒక సరికొత్త లుక్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది మరియు శర్వా కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మొదటిసారి ఇద్దరికీ కూడా పాన్ ఇండియా చిత్రంగా నిలవనుంది. దర్శకుడు చాలా కాలంగా ఈ కథపై వర్క్ చేశాడు, శర్వాను ఇప్పటివరకు చూడని కోణంలో ప్రజెంట్ చేయనున్నారు.
సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో ఉండబోతుందట. సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనుండగా, భీమ్స్ సెసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతర ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.