డాటర్ తో ఫస్ట్ గణేష్ ఫెస్టివల్.. శర్వా క్యూట్ మూమెంట్స్!
ఇప్పుడు తన కుమార్తె లీలా దేవితోపాటు కుటుంబసభ్యులతో కలిసి వినాయక చవితి పండుగను జరుపుకున్నారు శర్వా.
By: Tupaki Desk | 8 Sep 2024 9:06 AM GMTటాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్.. గత ఏడాది బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రక్షితా రెడ్డితో కలిసి ఏడడుగులు నడిచారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వారి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకలకు సినీ సెలబ్రిటీలు భారీగా హాజరయ్యారు. ఓ రేంజ్ లో సందడి చేశారు. అందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు.. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ ఏడాది మార్చిలో శర్వానంద్, రక్షిత.. తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ బుజ్జాయికి లీలా దేవి మైనేని అని నామకరణం చేశారు శర్వా దంపతులు. రీసెంట్ గా తమ అమ్మాయి పేస్ ను రివీల్ చేశారు. భార్య, కూతురితో వెళ్లిన వెకేషన్ ఫోటోలు ఇన్ స్టాలో శర్వానంద్ షేర్ చేశారు. అందులో లీల బబ్లీ లుక్స్ తో.. అచ్చ తండ్రిలాగానే ఛార్మింగ్ గా కనిపిస్తోంది.
ఇప్పుడు తన కుమార్తె లీలా దేవితోపాటు కుటుంబసభ్యులతో కలిసి వినాయక చవితి పండుగను జరుపుకున్నారు శర్వా. అందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో శర్వా మదర్ పూజ చేస్తుండగా.. కూతురిని పట్టుకుని ఆయన అన్నారు. పట్టు పరికిణీలో పాపాయి క్యూట్ గా కనిపిస్తోంది. ఫోటో సూపర్ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. శర్వా కూతురు ముద్దుముద్దుగా ఉందని చెబుతున్నారు.
ఇక శర్వా కెరీర్ విషయానికొస్తే.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన హోమ్లీ యాక్షన్ తో స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. తొలుత చిన్న చిన్న రోల్స్ చేసి ఆ తర్వాత స్టార్ డమ్ సాధించుకున్నారు. గమ్యం తర్వాత శర్వా కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు.
రీసెంట్ గా మనమే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఆ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లు సాధించింది. ఇప్పుడు రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో ఓ మూవీ.. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.